Home » కేసీఆర్‌ ను గెలిపించేందుకే తెలంగాణలో పవన్ పోటీ !

కేసీఆర్‌ ను గెలిపించేందుకే తెలంగాణలో పవన్ పోటీ !

by Bunty
Ad

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇటు సినిమాలు చేసుకుంటూనే అటు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

cm kcr pawan kalyan

మరో రెండు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉంటే కేవలం 32 నియోజకవర్గాలలో మాత్రం జనసేన పోటీలో ఉంటుందని ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ చేసిన ఈ ప్రకటనపై వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గెలుపు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్… పక్క రాష్ట్రంలో పోటీ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు ఏపీ వైసిపి నేతలు.

Advertisement

Advertisement

CM KCR Defeated By Madhan mohan

CM KCR Defeated By Madhan mohan

తెలంగాణలో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తుందని… దానివల్ల సీఎం కేసీఆర్ పార్టీ ఆస్థానాలలో కచ్చితంగా విజయం సాధిస్తుందని వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కూడా వెల్లడించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఏపీలో అన్ని స్థానాలలో పోటీచేయాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. తెలంగాణలో సీఎం కేసీఆర్ కోసం.. పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని ఆరోపణలు చేశారు పేర్ని నాని. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading