విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ – టీడీపీ మహిళల బాహాబాహీ…గడప గడపకు కార్యక్రమానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలుగు మహిళలపై వైసీపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కార్యక్రమం చేపడుతోంటే.. తమను రెచ్చగొట్టే విధంగా తెలుగు మహిళలు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కప్పివేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా 40 ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్నాయి.
Advertisement
తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడిపందాలు, జూదం నిర్వహించకుండా గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు చేయడం జరిగింది. ఈనెల 25వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నిన్న శ్రీవారిని 56,003 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,365 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
పల్నాడు పిడుగురాళ్లలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి ప్రధాన అనుచరుడు దియ్యా రామకృష్ణ….. గుంటూరు నుండి పిడుగురాళ్ల వెళ్తుండగా రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కొమురం భీం జిల్లాలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో 6.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 7.9డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాని చలి వణికిస్తోంది. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో 7.5, అల్మాయిపేట, సత్వార్ 8.8 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ప్రైవేట్ టీవీ చానెళ్లకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్-1995, ప్రోగ్రాం కోడ్ అమలు చేయాలని సూచించింది. ప్రోగ్రాం కోడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నేడు టీటీడీ ఉదయం 9 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
ఈ నెల 18న 5 లక్షల మందితో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షలకు పైగా జనసమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.