ఈ నెల 18న ఖమ్మంలో BRS సభకు మూడు రాష్ట్రాల సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ , విజయన్.. మాజీ సీఎం అఖిలేష్ లకు ఆహ్వానం అందింది. BRS ఏర్పాటయ్యాక తొలి బహిరంగ సభను ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్నా ఆ తరవాత ఖమ్మంకు మార్చారు.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 67,169 మంది భక్తులు స్వామి వారిని దర్శంచుకున్నారు.
సంక్రాంతికి సొంత ఊరికి నారా,నందమూరి కుటుంబాలు వెళుతున్నాయి. గత మూడేళ్ళ నుంచి కరోనా కారణంగా గ్రామానికి రాని రెండు కుటుంబాలు..మూడేళ్ళ తరువాత సంక్రాంతికి నారావారిపల్లెకి చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు విచ్చేస్తున్నాయి. ఇరు కుటుంబాల రాక సందర్భంగా నారావారిపల్లెలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Advertisement
ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదయ్యాయి. కోహిర్ లో 4.6, నల్లవల్లిలో 5.7, న్యాల్ కల్ లో 5.9 డిగ్రీల ఉషణోగ్రతలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికం అవుతోంది. దేశరాజధానిలో 1.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
ఢిల్లీలో ఈనెల 15 వరకూ స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. ఈనెల 14 వరకూ జార్ఖండ్ సర్కార్ సెలవులను ప్రకటించింది.
హైదరాబాద్ టీఎస్ పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్ 4 కు 2 లక్షల 48 వేల 955 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో సైబర్ లైనర్ ల పేరుతో కొత్తగా ఆర్టీసి మిని బస్సులను ప్రారంభించనున్నారు.
తెలంగాణ లో కానిస్టేబుల్,ఎస్సై అభ్యర్థులు చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. పరీక్షలో తప్పుడు ప్రశ్న లకు మార్కులు కలపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.