రిపబ్లిక్ డే సందర్భంగా 901 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర హోంశాఖ పోలీస్ మెడల్స్ అందజేస్తున్నారు. ఏపీ నుంచి ఇద్దరు అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందజేయనున్నారు. 15 మందికి పోలీస్ మెడల్ విభాగంలో అవార్డులు ఇవ్వనున్నారు.
Advertisement
ఏపీలో రెండో దశ అంబులెన్స్‌లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 240.69 కోట్ల వ్యయంతో 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు చేశారు. రూ. 112.62 కోట్ల వ్యయంతో మరో 165 అంబులెన్స్‌లు ప్రారంభించారు.
పవన్ కళ్యాణ్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై జనసేన ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాత్రి 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
Advertisement
ఏపీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. ఢిల్లీ నుండి విజయవాడ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. దాంతో బెంగళూరు నుండి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అయ్యింది.
నేడు పోలవరంపై సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు.
విజయవాడలో నేడు ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. దుర్గమ్మను దర్శించుకుని జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి పూజలు నిర్వహిస్తారు.
నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఈజిప్టు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు.