Home » Jan 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

జీవో నంబర్‌ 1పై హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది.

భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. కాగా ఈ భేటీకి దూరంగా కన్నా లక్ష్మీనారాయణ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. భీమవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి దూరంగా ఉండాలని కన్నా వర్గం నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

Advertisement

ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉన్నా ఆప్‌, బీజేపీ సభ్యుల వాగ్వాదంతో గత సమావేశం వాయిదాపడింది.


హైదరాబాద్‌ హకీంపేట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్‌లో పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ చిక్కుకుంది. లారీ రిపేర్ కావడంతో హకీంపేట్ వద్ద భారీగా ట్రాఫిక్ అయినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి నేడు పవన్ వారాహి వాహన పూజ కోసం కొండగట్టు వెళ్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

నిర్మల్ బాసరలో వసంత పంచమి వేడుకలకు సరస్వతి అమ్మవారి క్షేత్రం ముస్తాబయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 26న అమ్మవారి జన్మనక్షత్రం వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

సాయంత్రం 3.30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌ షామీర్‌పేట్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మద్యం దుకాణం వద్ద కాల్పులు జరిపి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. రెండు లక్షల రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లారు.

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ల బదిలీ జరగనుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి బుడితి రాజశేఖర్.. గోపాల కృష్ణ ద్వివేది.. గోపాల కృష్ణ ద్వివేదికి అదనంగా ఉన్న గనుల శాఖ కొనసాగించనున్నారు.

Visitors Are Also Reading