ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే లక్ష్యం అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గతంలో 8నెలల్లో మొదటి విడత పూర్తిచేశాం, ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత.. కాలనీకే కంటి వెలుగు బృందాలు వస్తాయని అన్నారు.
Advertisement
నేటి నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుంది. 1500 స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 మంది సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ ను పెట్టుకుంది ప్రభుత్వం.
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుకున్నారు. 7గురు ప్రయాణికుల దగ్గర రూ.1.59 కోట్ల విలువ చేసే 3.14 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
జీవో నంబర్ 1పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపి సర్కార్ సవాల్ చేసింది.
జల్లికట్టు నిర్వాహకులపై కేసు నమోదయింది. 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
తిరుమలలో 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74,229 మంది భక్తులు దర్శించుకున్నారు.
నేడు కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు.
నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
ఉప్పల్ వన్డేలో కివీస్ భారత్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
పల్నాడు సత్తెనపల్లి పీఎస్‌లో మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయ్యింది. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటిపై కేసు నమోదు అయ్యింది. ప్రైజ్, చిట్స్ అండ్ మనీ సర్కులేషన్, స్కీమ్స్ నిషేధ చట్టం ఉల్లంఘన కేసు నమోదు చేశారు