Home » Jan 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కర్రలు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రామన్నపల్లె గ్రామానికి చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం తో పలువురికి గాయాలు అయ్యాయి.

నేడు సింహాచలం దేవస్థానంలో మకర వేట ఉత్సవం జరగనుంది. వరదరాజ స్వామి రూపంలో దర్శనం ఇవ్వనున్న సింహాద్రి అప్పన్న.. గజేంద్ర మోక్షం, గ్రామ వీధికి సిద్ధమైన స్వామివారి పూలతోట.

Advertisement

తిరుమలలో 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 76,307 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,573 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు.

శ్రీశైలంలో ఐదో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం కైలాస వాహనంపై స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌ షో జరగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోడ్‌ షో నేపథ్యం లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Advertisement

ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి.

శ్రీలంకపై భారత్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 317 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. భారత్‌ స్కోర్‌ 390/5, శ్రీలంక స్కోర్‌ 73 ఆలౌట్‌. సెంచరీలతో విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ చెలరేగిపోయారు.

తెలంగాణా లో 9 వేల 266 మందికి టీచర్ ప్రమోషన్స్ ఇచ్చారు. ముందుగా హెడ్ మాస్టర్ ల బదిలీలు జరగనున్నాయి. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరగనున్నాయి. ఇపుడు బదిలీలు , పదోన్నతులు చేసినా…విద్యా సంవత్సరం ముగిసిన తరవాత ఏప్రిల్ లో రిలీవింగ్ చేయనున్నారు.

అవతార్ సినిమా దర్శకుడు కెమెరాన్ ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూసారు. ఈ విషయాన్ని రాజమౌళి వెల్లడించారు.

Visitors Are Also Reading