Home » Jan 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు రెండో రోజు టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమీక్షలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో థాక్రే భేటీ కానున్నారు. ఆ తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో థాక్రే సమావేశం కానున్నారు.

విజయవాడ బయలుదేరిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్… 10 గంటలకు ఏపీ సీఎస్ తో భేటీ భేటీ కానున్నారు. అనంతరం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సోమేష్ కుమార్ భేటీ కానున్నారు.

Advertisement


విశాఖ కేంద్రంగా జీ-20 సదస్సుల సన్నాహక సమావేశాన్ని సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించనున్నారు.

నిన్న తిరుమల శ్రీవారిని 68,850 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,280 మంది భక్తుల తలనీలాలు సమర్పించారు.

ఈ నెల 28వ తేదిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఒకే రోజు సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి వేడుకల నిర్వహణపై ఇవాళ అధికారులుతో ఇఓ ధర్మారెడ్డి సమీక్ష కానున్నారు.

Advertisement

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి పులి వణికిస్తోంది. చాలాచోట్ల సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8.8 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 9.1 డిగ్రీలు..మంచిర్యాల జిల్లాలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత, నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీలు నమోదయ్యాయి.

తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక.. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 15వ తేదీన వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

మాజీ మంత్రి తుమ్మల ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. ఖమ్మం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన పరిణామం. రేపు కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో కేసీఆర్‌ సభల నేపత్యంలో ఆ సభలను విజయవంతం చేసేందుకే తుమ్మల ఇంటికి హరీష్‌రావు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్‌ మ్యాచ్ జరగనుంది. మ. 1.30 నుంచి సా. 5 గంటల వరకు ఫస్ట్‌ ఇన్నింగ్స్ ….సా. 5.45 నుంచి రాత్రి 9.15 వరకు రెండో ఇన్నింగ్స్‌ జరగనుంది. ఈ నెల 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈసారి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇవ్వడంలేదు.

అమెరికాలోనే నిలిచిపోయిన 15 ఇండియన్‌ విమాన సర్వీసులు. సాప్ట్ వేర్ లో అంతరాయం వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు.

Visitors Are Also Reading