తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు, హీరోయిన్లకు ప్రత్యేకించి కొన్ని రకాల జానార్లు ఉంటాయి. అయితే అభిమానులు కూడా ఆ జానరులోనే వారిని ఊహించుకుంటూ ఉంటారు. వారి నుంచి ఆ విధమైన సినిమాలు వస్తేనే మరి యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా వారిని మరోరకంగా చూడలేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో కొనసాగుతున్నారు. ఆయన సడన్ గా టాలీవుడ్ లో ఒక చిన్న సినిమా చేస్తే ఫ్యాన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది పాన్ ఇండియా లెవెల్ యాక్టింగ్ చిత్రాలే. కట్ చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కథలు కొంతమంది హీరో, హీరోయిన్లు అనుకొని రాస్తూ ఉంటారు దర్శకులు..
Advertisement
తీరా అంతా అయిపోయాక ఈ కథను వారికి ఏదో ఒక కారణంగా వారు యాక్సెప్ట్ చేయలేరు. దీంతో ఆ కథ మరొకరికి వెళ్తుంది. అలా తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ మరియు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రావలసిన ఆ సినిమా ఆగిపోయిందట.. దీనికి కారణాలేంటో చూద్దామా.. అయితే వెంకటేష్ ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేయలేదు. కానీ అప్పట్లో వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్వామి వివేకానంద బయోపిక్ చేద్దాం అనుకున్నారట. ఈ సినిమా ఎప్పుడు చేసినా భారీగానే ప్లాన్ చేయాలని ఆలోచన చేశారట.
Advertisement
అయితే దీనికి దర్శకుడుగా రాజమౌళి చేయాలని మగధీర సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ అడిగారట. దీంతో రాజమౌళి చేద్దాం నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అన్ని అయిపోయాక చేద్దాం సార్ అని అన్నారట. ఆ తర్వాత బాహుబలి సినిమాతో బిజీ అవడం, ఆ వెంటనే త్రిబుల్ ఆర్ చేయడం , దీని తర్వాత మహేష్ బాబు తో కమిట్ అవ్వడం , ఇలా వరుస ప్రాజెక్టులు చేస్తుండడంతో వెంకటేష్ రాజమౌళి కాంబోలో రావలసిన ఈ సినిమా ఆగిపోతూ వస్తుందట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- Bichagadu 2 Review in Telugu : బిచ్చగాడు 2 మూవీ రివ్యూ..ఇరగదీశాడుగా
- My Story నాకు 40., తనకు 20.! ఇది మా స్టోరి!
- విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ ఇంటికి వెళ్లిన పనిమనిషి లక్ష్మమ్మ..నరేష్ అన్న మాటలకు ఏడుపొచ్చింది.. క్యారెక్టర్ బయటపెట్టిన లక్ష్మమ్మ..!!