Home » విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ ఇంటికి వెళ్లిన పనిమనిషి లక్ష్మమ్మ..నరేష్ అన్న మాటలకు ఏడుపొచ్చింది.. క్యారెక్టర్ బయటపెట్టిన లక్ష్మమ్మ..!!

విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ ఇంటికి వెళ్లిన పనిమనిషి లక్ష్మమ్మ..నరేష్ అన్న మాటలకు ఏడుపొచ్చింది.. క్యారెక్టర్ బయటపెట్టిన లక్ష్మమ్మ..!!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక లెజెండరీ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి సరికొత్త స్టైల్ ని పరిచయం చేసిన హీరో ఆయన.. ఎన్నో సినిమాలు తీసి సూపర్ స్టార్ గా మారారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ చివరికి తన శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకపోవడంతో నవంబర్ 15 గుండెపోటుతో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మరణ వార్త విని అభిమానులంతా ఒక్కసారిగా శోక సాంద్రంలో మునిగిపోయారు.. అంతటి గొప్ప హీరో మరణించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులంతా హైదరాబాద్ చేరుకున్నారు. వేలాది మంది అభిమానుల మధ్య ఆయన అంతిమయాత్ర కొనసాగింది. అలాంటి కృష్ణ మరియు విజయనిర్మల బ్రతికున్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు.

 

also read:సినిమాల్లోనే కాదు.. బిజినెస్ లో కూడా కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్..!!

వారి గొప్పతనం గురించి వారి ఇంట్లో ఏళ్లుగా పనిచేస్తున్న లక్ష్మమ్మ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.. నేను పద్మాలయ స్టూడియోస్ లో దాదాపుగా 40 ఏళ్లుగా పని చేశానని, నా కాలు విరగడంతో ప్రస్తుతం మూడు సంవత్సరాల నుంచి పని చేయడం లేదని చెప్పుకొచ్చింది. నా కాలు విరివి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తన మేనేజర్ ను పంపించి నాకు ఆర్థిక సహాయం చేశారని తెలియజేసింది. మా అమ్మాయి కృష్ణ గారి తమ్ముడు ఇంట్లో వంట పని చేస్తోందని తెలిపింది. ఆమె పెళ్లి మరియు ఆమె పిల్లలు చదువులు వారే చూసుకున్నారని మా మనవరాళ్ల పెళ్లిళ్లకు కూడా కృష్ణ విజయనిర్మల వచ్చారని చెప్పుకొచ్చింది.

అలాగే మా పిల్లల పెళ్లి విషయంలో కూడా బంగారం, ఆర్థిక సహాయం విజయనిర్మల అందించారని లక్ష్మమ్మ తెలియజేసింది. ఇక విజయనిర్మల చనిపోయిన తర్వాత కృష్ణ ఇంటికి వెళ్తే నరేష్, మా అమ్మ చనిపోయిందని,నువ్వు రావడం మానొద్దు లక్ష్మమ్మ అంటూ చాలా ఆప్యాయతగా మాట్లాడారట. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంటూ చెప్పారట. ఈ విధంగా నరేష్ క్యారెక్టర్ ను లక్ష్మమ్మ తన మాటల్లో తెలియజేసింది. అప్పట్లో కృష్ణ గారితో మాట్లాడాలి అంటే చాలా భయం వేసేది. కానీ కృష్ణ గారు మాత్రం అలా కాదు చాలా బాగా మాట్లాడుతూ సదాసీదాగానే ఉండేవారు. అంతటి గొప్ప వ్యక్తి చనిపోయారని తెలిసి చూడ్డానికి వెళ్దాం అనుకున్నా , కానీ అంతటి జనసాంద్రంలో చూడటానికి వీలుపడలేదు అంటూ ఎమోషనల్ అయింది లక్ష్మమ్మ.

also read:

Visitors Are Also Reading