ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో వరకట్న వేధింపుల సమస్యలు ఎక్కువైపోయాయి.. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్ని కట్టుబాట్లు చేసినా ఇవి మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలో తాజాగా సొంత అన్న భార్యపై వరకట్నం వేధింపులకు పాల్పడిందనే అభియోగంతో సినీ తార అభినయకు హైకోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. అభినయ అనుభవ అనే చిత్రం ద్వారా చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని చెప్పవచ్చు.. ఇక ఆమె పూర్వాపరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
ALSO READ:30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
1998 సోదరుడు శ్రీనివాస్ కు లక్ష్మీదేవి అనే యువతి తో వివాహం జరిగింది.. ఈ సమయంలో కట్న కానుకలు ఏమి కూడా తీసుకోలేదు.. అలా కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత కట్నం తేవాలని పదేపదే లక్ష్మీదేవిని వేధించడం మొదలుపెట్టారు.. ఓ రోజు లక్ష రూపాయల కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేయగా ఆమె 80 వేల రూపాయలు తీసుకొచ్చింది.. అయినా అత్తింటి వారు వేధింపులు ఆపలేదు.దీంతో విసుగు చెందిన బాధితురాలు 2002లో భర్త అత్తమామలతో సహా నటి అభినయ పై బెంగళూరులో చంద్ర లేఔట్ పిఎస్ లో కేసు పెట్టింది.. ఈ కేసు హైకోర్టులో విచారణ సాగింది.. దీనిని విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ హెచ్ బి ప్రభాకర్ శాస్త్రి నేరానికి సంబంధించిన అన్ని రుజువులు ఉండటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు..
Advertisement
అయితే ఇదే కేసు గతంలో చాలా మలుపులు తిరిగింది.. 2012లో కింది కోర్టు ద్వారా ఈ యొక్క కేసు 5 మందికి రెండేళ్ల జైలు శిక్ష, విధించగా, జిల్లా కోర్టు వీరి తప్పిదం లేదని వారి యొక్క శిక్షణ రద్దు చేసింది.. దీన్ని భాదితురాలి కుటుంబం హైకోర్టులో సవాలు చేస్తే విచారణ సాగింది.. భర్త శ్రీనివాస్ మరియు అత్తమామలు రామకృష్ణ, జయమ్మలకు ఐదేళ్ల జైలు శిక్ష, నాలుగవ నిధులు అయిన చలువ రాజుకు కూడా జైలు శిక్ష ఖరారైంది.. అభినయకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ALSO READ: