Home » రాత్రిపూట అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏంటంటే..?

రాత్రిపూట అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.అలాంటి ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలం.. ప్రస్తుత కాలంలో ఎంతోమంది బిజీ లైఫ్ దృష్ట్యా డబ్బు వేటలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి అదే ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అదే డబ్బుతో మళ్ళీ వైద్యాన్ని చేయించుకుంటున్నారు.. చేయకూడనటువంటి పనులు చేస్తూ ఆరోగ్యాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. సాధారణంగా అన్ని తింటేనే ఆరోగ్యంగా ఉంటారని అంటుంటారు.. కానీ అలా తినకూడని టైంలో తింటే కూడా ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు అంటున్నారు.. మరి రాత్రిపూట ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ALSO READ:భ‌ర్త త‌న భార్య‌కు ఈ 4 విష‌యాలు అస్స‌లు చెప్ప‌కూడ‌ద‌ట‌..చెబితే ఏం జ‌రుగుతుందంటే.?

Advertisement

చాలామంది రాత్రిపూట నిద్ర విషయంలో చాలా ఇబ్బందులు పడతారు.. సమయానికి నిద్ర రాక అనారోగ్యం బారిన పడే వాళ్లు అనేక మంది ఉన్నారు.. కాబట్టి సుఖ నిద్ర పోవాలంటే చాలామంది రాత్రిపూట మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందట.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దోసకాయను తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందట. అంతేకాకుండా రాత్రిపూట ఉడకని శనగలు తింటే కూడా శరీరం బలహీనపడి అనేక రోగాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రాత్రిపూట అరటిపండు తింటే జ్వరం, జలుబు లాంటివి వస్తాయట. అంతేకాకుండా రాత్రిపూట పెరుగు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరగదట. రాత్రి సమయంలో యాపిల్స్ తినడం వల్ల వీటిలోని ఫేక్టీన్ సులభంగా జీర్ణం కాకుండా ఉంటుంది. రాత్రిపూట బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారట. రాత్రిపూట కొవ్వుతో కూడిన గింజలు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారట.కాబట్టి పడుకునే ముందు ఈ పదార్థాలు అస్సలు ముట్టకూడని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading