Home » జ‌గ్గారెడ్డి రివ‌ర్స్ గేర్‌.. సోనియా, రాహుల్ గాంధీల‌కు లేఖ‌

జ‌గ్గారెడ్డి రివ‌ర్స్ గేర్‌.. సోనియా, రాహుల్ గాంధీల‌కు లేఖ‌

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి జ‌గ్గారెడ్డి రాజీనామా చేయ‌నున్నారని మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇవాళే గుడ్ బై.. టైం ఫిక్స్‌.. డెడ్‌లైన్ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు అవ‌మానం జ‌రుగుతుంద‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్య‌నేత రాహుల్ గాంధీకి లేఖ‌లు రాశారు జ‌గ్గారెడ్డి. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్‌లో తీవ్ర అవ‌మానానికి గుర‌వుతున్న జ‌గ్గారెడ్డి రాజీనామా చేస్తార‌నే హ‌డావుడి కొన‌సాగింది. జ‌గ్గారెడ్డి కాంగ్రెస్ అధినేత‌ల‌కు లేఖ‌తో స‌రిపెట్టారు.

Also Read :  ఎమ్మార్వోకు 6 నెలల జైలుశిక్ష.. ఏపీ హై కోర్టు కీల‌క తీర్పు

Advertisement

Advertisement

టీపీసీసీస చీఫ్ రేవంత్‌రెడ్డినే టార్గెట్ గా విమ‌ర్శు, లేఖ‌లు రాశారు జ‌గ్గారెడ్డి. పార్టీలోకి స‌డ‌న్‌గా వ‌చ్చి లాబీయింగ్ చేస్తే ఎవ‌రైనా పీసీసీ కావ‌చ్చు అన్నారు. అలాంటి త‌ప్పు తాను చేయ‌బోను అన్నారు. త‌నపై కుట్ర పూరితంగానే కోవ‌ర్టు అన్న ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అయినా పార్టీ వ్య‌వ‌స్థ వాటిని ఖండించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు. ఆర్థిక క‌ష్టాలున్నా పార్టీ కోస‌మే ప‌ని చేశాన‌ని, సోనియా రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భార్య‌నే నిల‌బెట్టాన‌ని.. పోటీకి నిల‌బెట్ట‌ని వారు కోవ‌ర్టులా..? తాను కోవ‌ర్టునా అని లేఖ‌లో జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు. పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి తాను స్వ‌తంత్రంగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. కాంగ్రెస్ గుంపులో తాను లేన‌ని ప్ర‌క‌టించారు జ‌గ్గారెడ్డి.

అంతకు ముందు జ‌గ్గారెడ్డి ఇవాళ రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం కాంగ్రెస్ క‌ల‌క‌లం రేపింది. పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఆయ‌న‌కు ఫోన్ చేసి బుజ్జ‌గించారు. వీహెచ్ అయితే స్వ‌యంగా జ‌గ్గారెడ్డి వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడారు. కొన్ని రోజులు ఆగాల‌ని సూచించారు. ఇవాళ రాజీనామా చేస్తార‌ని ముందు ప్ర‌చారం జ‌రిగినా సీనియ‌ర్ల ఒత్తిడితో జ‌గ్గారెడ్డి కాస్త వెన‌క్కి త‌గ్గారు.

Also Read :  బీజేపీ గెలిస్తే గ్యాస్ సిలిండ‌ర్లు ఫ్రీ…కేంద్ర‌మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

Visitors Are Also Reading