Home » ఏ ముఖం పెట్టుకుని రేవంత్ దగ్గరకి వెళ్లి అడగాలి: జగ్గా రెడ్డి

ఏ ముఖం పెట్టుకుని రేవంత్ దగ్గరకి వెళ్లి అడగాలి: జగ్గా రెడ్డి

by Sravya
Ad

ఒకవేళ కనుక గెలిచి ఉంటే సీఎం రేవంత్ దగ్గరికి వెళ్లి సంగారెడ్డి అభివృద్ధి కోసం నాకు ఇన్ని కోట్లు కావాలని డైరెక్ట్ గా అడిగేవాడిని, కానీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతాను అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి చెప్పినట్లు కొన్ని వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో అలానే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వచ్చాయి. అయితే అవి నేను చెప్పినట్లు చెప్పను అలా అని చెప్పలేదు అని చెప్పనని అన్నారు.

Advertisement

Advertisement

ఎందుకంటే వార్తలు వచ్చాయి అది అయిపోయింది అని అన్నారు. నాకు ఓటు వేసిన 70 వేల మందికి నేను జవాబు దారిగానే ఉంటానని అన్నారు. జగ్గారెడ్డి చెప్పింది నాకు ఓటేయని 80 వేల మంది ఆలోచన చేయాలని మాత్రమే చెప్తున్నాను అని అన్నారు. నాకు ఓటు వేసిన 70000 మందికి నేను ఓడిపోయిన ఎప్పుడు జవాబుదారీ గానే ఉంటానని అన్నారు. రెండో ప్రాధాన్యతలో నాకు ఓటు వేయని 80 వేల మందికి అండగనే ఉంటానని అన్నారు ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading