Home » జగపతిబాబు ను మోసం చేసిందెవరు…? కోట్ల ఆస్తులు ఎలా పోయాయంటే…?

జగపతిబాబు ను మోసం చేసిందెవరు…? కోట్ల ఆస్తులు ఎలా పోయాయంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో జగపతిబాబు. ప్రస్తుతం జగపతి బాబు విలన్ గా మరియు ఇతర పాత్రలు చేస్తూ అదరగొడుతున్నాడు. జగపతిబాబు ఒకప్పుడు వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా మళ్లీ హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతే కాకుండా లెజెండ్ సినిమా తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Advertisement

 

ఆ తరవాత రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమా లలో ముఖ్యమైన పాత్రలో నటించి అదరగొట్టాడు. ఇక జగపతి బాబు ఒకప్పుడు హీరోగా నటిస్తున్న సమయం లో నిర్మాతగా కూడా చేసి చేతులు కాల్చుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల పై మరియు తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర కామెంట్ లు చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు తన ఆస్తి ఎక్కడికీ పోలేదని అన్నారు. ఆస్తి ఎలా పోయింది తనకు తెలియదని….ఎవరు మోసం చేశారో వారి గురించి ఆలోచించను అని అన్నారు.

Advertisement

Jagapati babu

Jagapati babu

అంతే కాకుండా 30 కోట్లు ఉంటే హ్యాపీ గా ఉంటా అనుకున్నానని అన్నారు. వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని అనుకున్నట్టు చెప్పారు. అవకాశాల కోసం రెండు ఫోన్ లు చేతిలో పట్టుకుని ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. గతేడాది ముప్పై కోట్ల వచ్చాయని కానీ తాను ఎక్కువ సంపాదించాలని అనుకోవడం లేదన్నారు. డబ్బు ఉంటే సంతోషంగా ఉంటామానుకోవడం రాంగ్ అని చెప్పారు. కోట్లు ఉన్నా ఆక్సిజన్ అందక కోవిడ్ టైం లో చనిపోయిన వారు ఉన్నారని చెప్పారు.

Visitors Are Also Reading