Home » సలార్ లో జగపతి బాబు నటన మామూలుగా లేదుగా..!

సలార్ లో జగపతి బాబు నటన మామూలుగా లేదుగా..!

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు సమయం మాత్రమే  మిగిలి ఉంది.   అయితే ఇప్పటి నుంచే  సలార్ సందడి మొదలైపోయింది.  తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై ఇప్పటిదాకా ఉన్న అనుమానాలన్నింటిని పటా పంచల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సలార్ రిలీజ్ ట్రైలర్ ను ఇంటర్నెట్ డౌట్ అయ్యేంటంతా స్పీడ్ తో వైరల్ చేస్తూ.. ఇప్పటిదాకా ఉన్న ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టే పనిలో మునిగిపోయారు డార్లింగ్ ఫ్యాన్స్. ట్రైలర్ లో ఉన్న ఒక్కో యాక్షన్ సన్నివేశం ఒళ్ళు చేస్తుంటే.. అందులో ఉన్న డైలాగులు సినిమాపై ఆసక్తిని, ఆత్రుతను మరింతగా పెంచేస్తున్నాయి. ఇక ట్రైలర్ లో ఉన్న హైలెట్స్ లో జగపతిబాబు రోల్ ఒకటి.

Advertisement

ట్రైలర్ చూస్తుంటే.. జగపతి బాబు ఇందులో పృధ్వీరాజ్ సుకుమారన్ తండ్రిగా కనిపించబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఆయన విలన్ అన్న విషయాన్ని ట్రైలర్ గమనిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు విలన్ గా కెరీర్ టర్న్ అయ్యాక ఎన్నో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు జగ్గు భాయ్. లెజెండ్  సినిమా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత జగ్గు భాయ్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, ఎంత బిజీ అయినప్పటికీ ఆయనలో ఉన్న రాక్షసత్వాన్ని వాడుకోవడంలో పెద్దగా ఆసక్తిని కనపరచలేదు డైరెక్టర్. కానీ తాజాగా సలార్ ట్రైలర్ లో చూస్తుంటే జగ్గు భాయ్ కూర్చున్న విధానం, నవ్వుతున్న తీరు చూస్తుంటే కరుడుగట్టిన విలన్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్లు ఆయనను సెకండ్స్ నిడివిలో చూపించినప్పటికీ.. ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతుంది. ట్రైలర్ ను రిపీట్ మోడ్ లో పెట్టుకుని మరీ జగ్గు భాయ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గమనిస్తున్నారు నెటిజన్లు.


ఇక ప్రశాంత్ నీల్ విలన్ గా ఆయనను వాడుకున్న తీరుపై ప్రశంసిస్తూ, జగ్గు భాయ్ లుక్ ను పొగిడేస్తూ జగ్గు భాయ్ లో ఇంత రాక్షసత్వమా? ఈ విలన్ కి ఇచ్చి పడేయాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. జగ్గు భాయ్ మధ్య డైనోసార్ మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. అయితే కొంతమంది మాత్రం జగ్గు భాయ్ పాత్రను మరో కోణంలో చూస్తున్నారు. ట్రైలర్ లో ఆయన నవ్విన నవ్వకు కొత్త అర్ధాన్ని కనిపెడుతున్నారు. ఖాన్సర్ రాజ్యానికి జగ్గు భాయ్ అధిపతి అని, వాళ్లపై దండయాత్రకు వచ్చిన విలన్లను ఊచికోత కోయడానికి ప్రభాస్ రంగంలోకి దిగిన సందర్భంలో జగ్గు భాయ్ అలా కనిపించి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా జగపతి బాబు  పాత్ర ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading