తెలంగాణ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఓట్లు పడ్డాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏపీ రాజకీయాల మీద పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాపులని జనసేన టిడిపికి దూరం చేయడానికి వైసిపి అమలు చేస్తున్న వ్యూహం ఏంటి..? 2019 ఎన్నికల్లో టిడిపి పై విసిగిపోయిన కాపులు జనసేనకి కాకుండా వైసిపికి ఓట్లు వేయడం జరిగింది. కాపుల అత్యధికంగా ఉన్న స్థానాలలో వైసిపి భారీ మెజారిటీతో గెలిచింది.
Advertisement
అప్పటి ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ పోటీలో ఉన్న ముద్రగడ ఎపిసోడ్ కారణంగా కాపులందరూ టిడిపి మీద కోపం పెంచుకున్నారు. ఇలా వైసిపి కి ఓట్లు పడ్డాయి ఈసారి ఎన్నికల్లో అదే రిపీట్ అయ్యేటట్టు కనపడుతుంది ఇప్పుడు ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్నారు ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. ఏపీలో అత్యధిక జనాభా కలిగిన కాపుల ఓట్లపై ఈ పార్టీలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తమతో ఉంటే కాపులు ఓట్లు వస్తాయని టీడీపీ అనుకుంటోంది. అలాంటి చోట్ల పవన్ ఇమేజ్ ని వాడుకోవాలని టీడీపీ చూస్తోంది.
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే డిపాజిట్లు కోల్పోయింది ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్న తెలంగాణలో మాత్రం టిడిపి పార్టీ జనసేన కి మద్దతు ఇవ్వలేదు. జనసేనలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వైసిపి దీనిని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. టీడీపీ వెనుకకి వెళ్ళట్లేదని పార్టీతో పాటు ముందుకు వెళ్తున్నామని పవన్ చెప్పారు. వైసిపి మైండ్ గేమ్ ఆడుతుంది అన్న పవన్ కళ్యాణ్ పొత్తులని వ్యతిరేకించే వారిని వైసిపి కోవర్టులుగా చూస్తానంటూ పార్టీ శ్రేణులకి హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!