పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల వరకు రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. అప్పటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో 24 స్థానాల్లో, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మిగిలిన వారిని గెలుపు గుర్రాలను వెలికితీసే పని ఉన్నారు పవన్ కళ్యాణ్.
Advertisement
Advertisement
ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ మొన్న తాడెపల్లిగూడెంలో జరిగిన జనసేన-టీడీపీ జెండా బహిరంగ సభలో పవన్ ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ” మాట్లాడితే నాకు నాకు నాలుగు పెళ్లిళ్లు అంటున్నారు. ఆ నాలుగో పెళ్లాం జగనే” అని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధానంగా జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ ను మహిళగా మార్చి ఫొటోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల కింద కూడా కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. మా నాలుగో వదిన చాలా బాగుంది అన్నయ్య అంటూ కొందరూ కామెంట్స్ చేస్తూ.. నాలుగో పెళ్లి ఎప్పుడు అయింది అన్న అంటూ మరికొందరూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే..?