ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు జగన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల విడుదల చేసిన 6,511 పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రెండేళ్ల పాటు వయసు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తాజాగా విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చారు. కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్సై, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఏపీఎస్పి రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు నియామకాలకు డిసెంబర్ 28, జనవరి 18 తేదీల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.
Advertisement
Advertisement
ఎస్సై పోస్ట్ లు 411, కానిస్టేబుల్ పోస్టులు 6,100 వరకు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్పి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్సై పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు.
READ ALSO : కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయంటే !