Home » ఆ పాట కోసం….104 డిగ్రీల జ్వ‌రంతో చిరు డాన్స్!

ఆ పాట కోసం….104 డిగ్రీల జ్వ‌రంతో చిరు డాన్స్!

by Azhar
Ad

1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చినచిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాలోని ప్ర‌తిపాట సూప‌ర్ హిట్, ఇళ‌య‌రాజా మ్యూజిక్, వేటూరి లిరిక్స్ కార‌ణంగా ఇప్ప‌టికీ ఆ సినిమాలోని పాట‌లు ఆల్ టైమ్ ఫేవ‌రెట్స్!

Advertisement

సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అబ్బ‌నీతియ్య‌నీ దెబ్బ పాట షూట్ ., చిరంజీవికి 104 డిగ్రీల జ్వ‌రం… ఈ పాట షూట్ చేసుకొని శ్రీదేవి బాలీవుడ్ మూవీ షూటింగ్ కు వెళ్లాలి. చిరు నో అంటే షూట్ వాయిదా ప‌డేది కానీ చిరు డాన్స్ కు రెడీ అన్నారు. రెండు రోజుల్లో మైసూర్ లో ఈ పాట షూట్ అయిపోయింది. షూట్ జ‌రుగుతున్న రెండు రోజులు ఓ డాక్ట‌ర్ ను సెట్ లోనే ఉంచారు నిర్మాత అశ్వ‌నీద‌త్!

Advertisement

Also Read: ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాకి చిరంజీవికిచ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

అబ్బ‌నీ తియ్య‌నీ దెబ్బ :
వాస్త‌వానికి ఇళ‌యరాజా ఈ పాట ట్యూన్ మెలొడీ టైప్ లోఉంటుంది. కానీ వేటూరి లిరిక్స్ ఈ మెలోడీని కాస్త మాస్ పాట‌గా మార్చేశాయి. త‌ర్వాత ఇళ‌య‌రాజా కూడా ట్యూన్ కాస్త సెట్ చేశార‌ట‌….ఆ పాటే అబ్బ‌నీ తియ్య‌నీ దెబ్బ‌గా చిర‌స్థాయిగా నిలిచిపోయింది.

ఇక ఈ సినిమాలోని అన్ని పాట‌ల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది.

  • అందాలలో అహో మహోదయం అనే పాట‌ను షూట్ చేయ‌డానికి 13 రోజులు ప‌ట్టింది.
  • దినక్కుతా.. దినక్కురో పాట కోసం వాహినీ స్టూడియోలో పెద్ద సెట్ వేశారు.

Also Read: కృష్ణ వ‌దిలేసిన ఈ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!?

Visitors Are Also Reading