మొహలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా పట్టు బిగించింది. మూడవ రోజు భారత భౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు తేలిపోయారు. ప్రతి బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలింగ్ ముందు ఎక్కువ సేపు నిలువలేకపోయారు. కేవలం 174 పరుగులకే శ్రీలంక కుప్పకూలిపోయింది. బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లో కూడా రవీంద్ర జడేజా తన సత్తా చాటాడు.
Also Read : మహిళలనుద్దేశించి తెలంగాణ హోంమంత్రి ఏమన్నారంటే..?
Advertisement
భారత్ కంటే 400 పరుగులు వెనుకంజలో శ్రీలంక ఉండడంతో ఫాలో ఆన్ ఆడక తప్పని పరిస్థితి శ్రీలంకది. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు ఓ నిస్సంక మినహా.. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా నిలబడలేకపోయారు.చివరి నలుగురు బ్యాట్స్‌మెన్‌లు లక్మల్, ఎంబుల్డేనియా, విశ్వ ఫెర్నాండో, లహిర్ కుమారాలు డకౌట్‌గా వెనుదిరిగారు.
Advertisement
కేవలం 13 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను కోల్పోయింది. రవీంద్ర జడేజా 5 వికెట్లు.. అశ్విన్, బుమ్రాలు తలా రెండు వికెట్లు.. షమి ఒక వికెట్ తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక రెండవ ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. కేవలం 19 పరుగులకే తొలి రెండు వికెట్లు కోల్పోయింది. లహిరు తిరుమన్నే, నిస్సాంక ఇద్దరు అశ్విన్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం విశేషం.
Also Read : IND vs SL : రోహిత్, ద్రవిడ్‌ల తప్పేమి లేదు.. క్లారిటీ ఇచ్చిన జడేజా..!