భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. తొలి వన్డే టీమిండియా గెలవగా… రెండవ వన్డేలో విండీస్ నెగ్గింది. ఇక మూడో వన్డే సిరీస్ ను నిర్ణయించేది కావడంతో ఆసక్తిగా మారింది. రెండవ వన్డేలో టీమిండియా ఓడిపోవడంతో జట్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాజీ ఆటగాడు కపిల్ దేవ్ సైతం జట్టును ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Advertisement
సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ జట్టులో ఒకలా… జాతీయ జట్టుకు వచ్చేసరికి ఇంకోలా ప్రవర్తిస్తున్నారని, వీరికి జాతీయ జట్టు కన్నా ఐపీఎల్ ముఖ్యమా…అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు? దానికి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కౌంటర్ ఇచ్చాడు. కపిల్ దేవ్ చెప్పినట్టుగా ఇక్కడ ఎవరికీ పొగరు లేదన్నారు. అవకాశాలు ఎవరికీ సునాయాసంగా రావని అన్నాడు. ఆటగాళ్లు అంతా 100% కష్టపడతారని చెప్పుకొచ్చారు. జట్టు ఓడిపోయినప్పుడే ప్రశ్నలు వస్తాయని జడేజా అన్నారు.
Advertisement
ప్రపంచకప్ ముందు తాము ఆడే చివరి వన్డే సిరీస్ వెస్టిండీస్ తోనే అని… అందుకే జట్టులో ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు. రెండవ వన్డేలో ఓడిపోయిన పెద్దగా నష్టమేమీ ఉండదనే ఉద్దేశంతోనే మార్పులు చేశామని అన్నారు. ఏం చేయాలో కెప్టెన్ కు, టీం మేనేజ్మెంట్ కు తెలుసు అని కపిల్ దేవ్ కు కౌంటర్ ఇచ్చాడు జడేజా.
ఇవి కూడా చదవండి
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!
Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం
BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే