టాలీవుడ్ కు ఎంతో మంది కమెడియన్ లను పరిచయం చేసిన టీవీ షో జబర్దస్త్. ఇప్పటికీ ఈ కామెడీ షో మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన చాలా మంది కమెడియన్లకు లైఫ్ వచ్చింది. అయితే కొంతమంది సినిమాల్లో రాణిస్తుండగా మరికొందరు టీవీ షోలలో సందడి చేస్తున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ షోలోనే కంటిన్యూ అవుతున్నారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ గణపతి కూడా ఒకరు. జబర్దస్త్ గనపతి ఆది, అభి, శకలక శంకర్ ల టీమ్స్ లో చేసి ఎంతో గుర్తింపు తచ్చుకున్నాడు.
అంతే కాకుండా గనపతి కొన్ని చిన్న సినిమాలలో కూడా నటించి తన కామెడీతో ఆకట్టుకున్నాడు. తనకు మొదటగా అవకాశం ఇచ్చింది అభి అని కానీ ఆది కూడా సహాయం చేశారని అన్నారు. గణపతి జబర్దస్త్ లోకి రాకముందు స్కూల్ టీచర్ గా పనిచేశానని అన్నారు. తనది శ్రీకాకుళం అని సినిమాల పై ఉన్న ఆసక్తితో ప్రయత్నించానని చెప్పారు. తనకు ఆది స్కిట్ లలో ఏదో ఒక అవకాశం ఇస్తూ ఉండేవారని చెప్పారు.
జబర్దస్త్ లో చేసేందుకు చాలా మంది వస్తారని అన్నారు. తనకు మొట్టమొదటగా 2013 లో రూ.1000 రూపాయలు ఇచ్చారని అన్నారు. స్కిట్ తరవాత రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇస్తారని…అంతే కాకుండా బిర్యానీ కూడా పెట్టేవారని అన్నారు.
ALSO READ : చరణ్ శంకర్ సినిమాలో విలన్ గా తమిళనటుడు…!
ఎవరి గ్రూప్ లో చేసినా కూడా రెమ్యునరేషన్ అనేది స్కిట్ పూర్తయ్యిన తరవాత చెక్ రూపంలోనే ఇచ్చేవారని గణపతి వెల్లడించారు. ఒకవేళ తనుకు అవకాశాలు రాకున్నా జీవితంలో కృంగిపోకుండా టీచింగ్ ప్రొఫెషన్ మాత్రం విడిచిపెట్టలేదని గణపతి వెల్లడించారు. జబర్దస్త్ లో సక్సెస్ అయ్యిన తరవాతనే టీచింగ్ ను విడిచిపెట్టానని అన్నారు. తన కుటుంబం కూడా తన పట్ల ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.