Home » చరణ్ శంకర్ సినిమాలో విలన్ గా తమిళనటుడు…!

చరణ్ శంకర్ సినిమాలో విలన్ గా తమిళనటుడు…!

by AJAY
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించగా త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. మరోవైపు రామ్ చరణ్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగానే రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

ramcharan

ramcharan

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కలెక్టర్ పాత్రలో నటించబోతున్నట్టు గా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో తమిళ నటుడు ఎస్ జే సర్యాష్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తో పాటు సునీల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య నటించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే ఎస్ జే సూర్య మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా లో విలన్ గా నటించారు. అంతేకాకుండా రీసెంట్ గా విడుదలైన మానాడు చిత్రంలో పోలీస్ గా కనిపించారు.

Visitors Are Also Reading