Home » Jabardasth Pavitra : గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్ మెంట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్

Jabardasth Pavitra : గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్ మెంట్ చేసుకున్న జబర్దస్త్ కమెడియన్

by Bunty
Ad

జబర్దస్త్ యాక్టర్ పవిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. తన కామిడీ టైమింగ్, పంచులతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. జబర్దస్త్ క్రేజ్ వల్ల పవిత్ర ఎన్నో అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఈవెంట్లో పవిత్ర ఉండడం విశేషం.

Jabardasth Pavithra shares her love story with Santhosh 

అంతేకాకుండా ఇతర చానల్స్ లో కూడా పవిత్ర పార్టిసిపేట్ చేస్తోంది. అంతేకాకుండా సీరియల్స్ లో కూడా అవకాశాలను అందుకుంటుంది. పవిత్ర సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తన యూట్యూబ్ ఛానల్ లో కొన్ని రోజుల క్రితమే తనకు కాబోయే భర్త అంటూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వ్యక్తి ఎవరెవరో కాదు పవిత్రను ఎప్పటినుంచో ఎంతగానో ప్రేమిస్తున్న అబ్బాయి సంతోష్.

Advertisement

Advertisement

ఈ వ్యక్తి పవిత్రని సంవత్సరం క్రితం నుంచి ఎంతగానో ప్రేమిస్తూ తనకి ప్రపోజ్ చేశాడు. ఇన్ని రోజులు తన రిప్లై కోసం ఎదురు చూశాడు. ఇక ఈ మధ్యకాలంలోనే పవిత్ర అతనికి ఓకే చెప్పింది. తనేంటో, తన కుటుంబం ఏంటో బాగా తెలుసుకున్నాను. నాకు సంతోష్, అతని కుటుంబసభ్యులు చాలా బాగా నచ్చారు అంటూ ఓకే చెప్పింది. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading