Home » JABARDASTH : ఆది టీమ్ కోసం మొద‌టిసారి కిచెన్ లోకి రోజా…కాఫీ అడిగితే సాల్ట్ అంటూ..!

JABARDASTH : ఆది టీమ్ కోసం మొద‌టిసారి కిచెన్ లోకి రోజా…కాఫీ అడిగితే సాల్ట్ అంటూ..!

by AJAY
Ad

తెలుగులో వ‌చ్చిన కామెడీ షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక సంచ‌ల‌నం అనే చెప్పాలి. గ‌త కొన్నేళ్లుగా ఈ కామెడీ షో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో కామెడీ షోలు వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్ అంత హిట్ అయిన కామెడీ షో మ‌రొక‌టి లేదు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ త‌ర‌వాత కూడా ఎన్నో కామెడీ షోలు పుట్టుకువ‌చ్చాయి. కానీ అవి కూడా నిల‌బ‌డ‌లేక‌పోయాయి. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షో స‌క్సెస్ లో క‌మెడియ‌న్ లు చేసే స్కిట్ లు ఎంత ముఖ్య‌మో రోజా మ‌రియు నాగ‌బాబు జ‌డ్జిలుగా చేసిన కృషి కూడా అంతే ముఖ్య‌మ‌ని చెప్పాలి.

jabardasth adi in rojas kitchen

Advertisement

అయితే ఎవో కార‌ణాల వ‌ల్ల నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ ను వీడి ఇతర టీవీ షోల‌లో క‌నిపిస్తున్నా రోజా మాత్రం ఇప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్ లో కొన‌సాగుతూనే ఉన్నారు. ఇక రోజా కంటెస్టెంట్ ల‌తో ఎంతో స‌ర‌దాగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా రోజా ఇంట్లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది త‌న టీం తో కనిపించారు. హైప‌ర్ ఆది త‌న టీం సభ్యుల‌తో క‌లిసి రోజా కిచెన్ ఉండ‌గా వీరి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రింగింది.

Advertisement

కిచెన్ లోకి వెళ్లిన రోజాను చూసి ప‌నిమ‌నిషి ఆశ్చ‌ర్య‌పోగా….ఎందుకంత ఆశ్చ‌ర్య‌పోతున్నావంటూ రోజా ప్ర‌శ్నించింది. దాంతో ప‌నిమ‌నిషి మీరెప్పుడూ వంట‌గ‌దికి రారు క‌దా అందుకే అంటూ ఆన్స‌ర్ ఇచ్చింది. కానీ రోజా మాట్లాడుతూ ఈరోజు నేనే వంట చేస్తానని చెప్పింది.

 

వెంట‌నే హైప‌ర్ ఆది ఆవిడేమో కిచెన్ లోకి రారు అంటుంది..ఈవిడేమో నేనే వంట చేస్తానంటుంది అంటూ కామెంట్ చేశారు. ఇక రోజా మీకు ముందు కాఫీ పెడ‌తా అంటూ సాల్ట్ ఎక్క‌డ అంటూ ప‌నిమ‌నిషిని అడుగుతుంది. ఈ వీడియోను చూస్తూ స్టెజిపై ఉన్న అన‌సూయ ఇత‌ర క‌మెడియ‌న్లు ఎంత‌గానో న‌వ్వుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading