Home » శృతిమించిన జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ….మంగళవారం అంటూ రోజా దారుణమైన బూతు సామెత…!

శృతిమించిన జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ….మంగళవారం అంటూ రోజా దారుణమైన బూతు సామెత…!

by AJAY
Ad

టెలివిజ‌న్ రంగంలో సంల‌చ‌నం శృష్టించిన కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్. వంద‌ల ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ కామెడీ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టికీ ఈ కామెడీ షో స‌క్సెస్ ఫుల్ గా కొన‌సాగుతూ ఉంది. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా ఎంతో మందికి లైఫ్ వ‌చ్చింది. ధ‌న్ రాజ్, వేణు, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆది స‌హా ఎంతో మందికి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్ లో కొత్త‌వాళ్ల ఎంట్రీ ఉంటుంది. మొద‌ట్లో జ‌బ‌ర్ద‌స్త్ లో పురుషులే మ‌హిళ‌లా న‌టించేవారు కానీ ఇప్పుడు మ‌హిళ‌ల‌ను సైతం తీసుకుంటున్నారు.

Advertisement

అయితే ఎంతో స‌క్సెస్ ఫుల్ కామెడీ షోగా పేరు సంపాదించుకున్న జ‌బ‌ర్ద‌స్త్ షోపై కొన్ని విమర్శ‌లు కూడా ఉన్నాయి. జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌ల్గ‌ర్ కామెడీ ఉంటుంద‌ని చాలా మంది ఈ షోపై విమర్శ‌లు కురిపిస్తూ ఉంటారు. కాస్త అదిత‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని చెబుతుంటారు. డ‌బుల్ మీనింగ్ డైలాగులు కూడా దారుణంగా ఉంటాయ‌ని ఫ్యామిలీ తో చూడాలంటే క‌ష్ట‌మ‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తుంటాయి.

Advertisement

అయింతే చాలా మంది ఈ కామెడీనే ఇష్ట‌ప‌డుతున్నారు కూడా..లేదంటే ఊరికే మిలియ‌న్ల కొద్ది వ్యూవ్స్ రావ‌డం కూడా అంత ఈజీ కాదు. ఇక సాధార‌ణంగా కామెడీ షోల‌లో జ‌డ్జిలు చూసి మార్కులు వేయ‌డం….యాంక‌ర్ అంటే పిల‌వ‌డం స్కిట్ అయ్యాక జడ్జిల‌ను రిజ‌ల్ట్ అడ‌గ‌టం ఇంతే. కానీ జ‌బ‌ర్ద‌స్త్ లో మాత్రం క‌మెడియ‌న్ ల‌తో పాటూ జ‌డ్జిలు యాంక‌ర్ కూడా స్కిట్ లోకి దూరి పోతారు.

also read : సుడిగాలి సుధీర్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో చెప్పిన బుల్లెట్ భాస్కర్

మ‌ధ్య మ‌ధ్య‌లో పంచ్ లు వేస్తూ ఉంటారు. అయితే తాజాగా విడుద‌లైన జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో కూడా అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. తాగుబోతు ర‌మేష్ ఓ స్కిట్ చేస్తున్నాడు. స్కిట్ లో త‌న భార్య పిలుస్తుంటే ఈ రోజు మంగ‌ళ‌వారం అంటూ నో చెబుతున్నాడు. దాంతో జ‌డ్జి రోజా మ‌ధ్య‌లో వ‌చ్చి మంగ‌ళ‌వారం అంటూ అదేదో సామతె ఉందిగా అంటూ దారుణ‌మైన బూతు సామెత‌ను గుర్తు చేసింది. దాంతో అంద‌రూ ఒక్క‌సారిగా నోరు తెరిచారు.

Visitors Are Also Reading