Home » Dhamaka movie: జగన్ సర్కార్ కు భారీ పంచ్ ఇచ్చిన “జబర్దస్త్” కమెడియన్..!

Dhamaka movie: జగన్ సర్కార్ కు భారీ పంచ్ ఇచ్చిన “జబర్దస్త్” కమెడియన్..!

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని మాటలు కానీ సమాజంలోని కొన్ని వర్గాల వారిని హట్ చేసినట్టు ఉంటాయి. అలా జరిగిన సందర్భంలో చాలావరకు సినిమాలపై కేసులు వేసిన సందర్భాలు కూడా అనేకం.

Advertisement

ఈ తరుణంలోనే జబర్దస్త్ కమెడియన్ వేసిన ఒక పంచ్ జగన్ సర్కారుపై వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజం ఏంటో, అబద్ధం ఏంటో తెలుసుకుందాం.. తాజాగా విడుదలైన ధమాకా మూవీలో ఒక పంచ్ జగన్ సర్కార్ కు వేసినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఈ పంచ్ వేసింది రవితేజ కాదు. కమెడియన్ హైపర్ ఆది.

also read:టాప్ 2లో టీమిండియా… ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో…

ధమాకా చిత్రంలో హైపర్ ఆది రావు రమేష్, డ్రైవర్ పాత్రలో నటిస్తాడు. ఆయన పేరుకే డ్రైవర్ కానీ ఓనర్ పై పంచులు వేస్తూ ఉంటాడు. అయినా రావు రమేష్ హైపర్ ఆదిని ఏమనడు, దీనికి ప్రధాన కారణం హైపర్ ఆది డ్రైవర్ గా వచ్చాక రావు రమేష్ కు కలిసి వచ్చిందట. దీని కోసమే ఆది ఏ పంచ్ వేసిన ఆయన సైలెంట్ గానే ఉంటారు.. ఈ తరుణంలోనె, రావు రమేష్ రవితేజను చంపడం కోసం రౌడీలను పెడతాడు. వారికి పదేపదే ఫోన్ చేస్తూ వేశారా వేసేసారా అంటూ అడుగుతాడు.. ఈ క్రమంలో బాబాయ్ అప్పటినుంచి వేశారా వేసేసారా అంటున్నారు.. ఒకటో తారీకు వచ్చింది నా సాలరీ వేశారా లేదా..? అంటూ పంచ్ డైలాగ్ విసురుతాడు. అయితే ఈ పంచ్ కావాలనే వేశారా లేదంటే ఫ్లోలో వచ్చిందా అనేది తెలియదు కానీ, ఇది జగన్ సర్కారికి సరిగ్గా తగిలేలా ఉంది..

Advertisement

ఎందుకంటే ఏపీలో ఉద్యోగులకు టైంకి జీతాలు పడటం లేదు.. నేల మధ్యలోకి వచ్చిన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారట. ఈ తరుణంలోనే ఉద్యోగుల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ టైంలో ఈ పంచ్ డైలాగ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.. అంతేకాకుండా సినిమాలో రవితేజ నేపోటిజంపై మరో డైలాగు వేశాడు.. నా వెనక ఎవరున్నారో తెలుసా అని ఒక విలన్ అంటే.. ” నేను వెనక ఎవరో ఉంటే పైకి వచ్చిన వాడిని కాదు” వెనక ఎవరూ లేకపోయినా పైకి రావచ్చని నిరూపించిన వాడిని” అంటూ డైలాగ్ విసిరాడు. అయితే ఈ డైలాగ్ టాలీవుడ్ హీరోలపై వేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

also read:

Visitors Are Also Reading