Home » న్యూయార్క్ లోని ఆ రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

న్యూయార్క్ లోని ఆ రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25, 2022న విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ప్రదర్శించబడుతూ అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంటుంది. మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా కలిసి నటించారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బిజీగా ఉన్నారు. 

Advertisement

ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం అమెరికా ట్రిప్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. సతీమణి, కుమారులతో కలిసి బ్రేక్ సమయాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తారక్ ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో ఎన్టీఆర్ ఓ రెస్టారెంట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు.. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. 

Also Read :  విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తులు..ఎన్ని కోట్లంటే..?

Advertisement

న్యూయార్క్ లోని జునూన్ అనే పాపులర్ ఇండియన్ రెస్టారెంట్ కి సంబంధించిన స్టోరీని పోస్ట్ చేశాడు ఎన్టీఆర్. అంతర్జాతీయ పర్యటనలో బహుశా అత్యుత్తమ ఇండియన్ ఫుడ్ లభించవచ్చు.. జుమాన్, NYC నా టెస్ట్ బడ్స్ ని సంతృప్తిపరిచిన స్పైసీ పీస్. అమేజింగ్ అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. తాజాగా షేర్ చేసిన ఫోటోలో రెస్టారెంట్ సిబ్బంది నవ్వుతుండగా.. తారక్ మాత్రం పెరిగిన గడ్డం, మీసాలతో కొత్త లుక్ లో కనిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర, నందమూరి కళ్యాణ్ రామ్  నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ ని ప్రకటించనున్నారు. 

Also Read :  చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలు..14 ఏళ్ళ కిందట ఏమైంది?

Visitors Are Also Reading