Home » Jabardasth Faima: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన జబర్ధస్త్ లేడీ కమెడియన్ ఫైమా..!

Jabardasth Faima: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన జబర్ధస్త్ లేడీ కమెడియన్ ఫైమా..!

by Bunty

పటాస్ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా బుల్లితెరకి ఎంత ఇచ్చిన ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పటాస్ షోలో మంచి గుర్తింపును తెచ్చుకొని జబర్దస్త్ లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొని తన అద్భుతమైన కామెడీతో అతి తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను, జడ్జీలను సైతం అలరించింది.

Jabardast Comedian Faima new house warming ceremony

Jabardast Comedian Faima new house warming ceremony

జబర్దస్త్ తో పాటు పలు షోలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. అలా ఫైమా గత సీజన్ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని తెచ్చుకుంది. అలా కొన్ని రోజులపాటు బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమందిని ఎంటర్టైన్ చేసింది. చాలా పేదరికం నుంచి ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీకి వచ్చిన ఫైమా ఇప్పుడు తన సొంతింటి కలను సాకారం చేసుకుంది. తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఓ ఇంటిని నిర్మించి బహుమతిగా అందించింది. ఇక తాజాగా గృహ ప్రవేశం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తన తల్లి బీడీలు చుట్టి వారిని ఎంతో కష్టపడి పెంచిందని, ఆ కష్టంతోనే పెరిగానని అందుకే తల్లిదండ్రులకు ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పుకొచ్చింది ఫైమా. ఇక ఫైమా కమెడియన్ గానే కాకుండా డాన్సర్ గా కూడా తన సత్తాను చాటుకుంది. ఇక సినిమాలలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది పైమా. ఫైమా యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులను సంపాదిస్తుంది. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించి భారీగానే డబ్బులను సంపాదిస్తుంది.

Visitors Are Also Reading