Home » Conductor Jhansi : కండ‌క్ట‌ర్ ఝాన్సీ డ్యాన్స్ ఆ హీరో ఫిదా.. సినిమాలో ఛాన్స్‌..!

Conductor Jhansi : కండ‌క్ట‌ర్ ఝాన్సీ డ్యాన్స్ ఆ హీరో ఫిదా.. సినిమాలో ఛాన్స్‌..!

by Anji
Published: Last Updated on

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా సెన్షేస‌న్ కండక్ట‌ర్ ఝాన్సీ పేరు చాలా గ‌ట్టిగానే వినిపిస్తోంది. గాజువాడ ఆర్టీసీ డిపోలో కండ‌క్ట‌ర్‌గా ప‌ని చేసే ఝాన్సీ త‌న డ్యాన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. గ‌తంలో ఎన్నో స్టేజ్‌ల‌పై డ్యాన్స్ చేసినా ఆమెకు అంత‌గా గుర్తింపు రాలేదు. కానీ ఈటీవీలో ప్రసార‌మైన శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో ఝాన్సీ త‌న ఢ్యాన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఇక అప్ప‌టి నుంచి ఆమె లైఫ్ మొత్తం మారిపోయింద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆమె రూ.2వేలు, రూ.3వేల‌కు స్టేజీపై డ్యాన్స్ చేసిన కండ‌క్ట‌ర్ ఝాన్సీ ఇప్పుడు రూ.10వేల నుంచి రూ.15వేల వ‌ర‌కు రోజు వారి పారితోషికం తీసుకుంటూ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంది. ఇక నుంచి ఆమె స్థాయి మ‌రింత పెర‌గనుంది. ఏకంగా ల‌క్ష‌ల రూపాయ‌లు ఆమెకు పారితోషికంగా అంద‌నున్నాయి.


తాజాగా ఈ టాలెంటెడ్ కండ‌క్ట‌ర్‌కి ఓ హీరో సినిమా ఛాన్స్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఆమె డ్యాన్స్‌కి హీరో సంపూర్ణేష్ బాబు ఫ్యాన్ అయిపోయాడు. ఆమె గురించి తెలుసుకొని తాను చేయ‌బోయే సినిమా ఆమెకు అవ‌కాశం ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు న‌టిస్తోన్న నెక్ట్స్ సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో ఝాన్సీకి ఛాన్స్ ఇచ్చారు. స్వ‌యంగా సంపూర్ణేష్ బాబు ఫోన్ చేయ‌డంతో ఝాన్సీ తెగ సంబుర‌ప‌డిపోయింది. ఎన్నో ఇబ్బందులు ప‌డి ఈ స్థాయికి వ‌చ్చిన కండ‌క్ట‌ర్ ఝాన్సీకి సంపూర్ణేష్ బాబు అవ‌కాశం ఇవ్వ‌డం అనేది గొప్ప విష‌యం.

Also Read :  బ్లాక్ టీ యొక్క‌ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

 

Jhancy

Jhancy

ఇక ఇప్పుడిప్పుడే సంపూర్ణేష్ బాబు ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నాడు. అలాంటి వ్య‌క్తి ఇత‌రుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం అంటే గొప్ప విష‌య‌మేన‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పెద్ద హీరోలు కూడా త‌లుచుకుంటే ఝాన్సీకి ఎంతో మంది పెద్ద హీరోలు, ద‌ర్శ‌కులు అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చు. కానీ ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. కేవ‌లం సంపూర్ణేష్ బాబు మాత్ర‌మే ప‌ట్టించుకున్నాడు అంటూ సోష‌ల్ మీడియాలో అత‌డిని దేవుడు అంటూ కితాబిస్తున్నారు. ఎవ్వ‌రూ ఆప‌ద‌లో ఉన్నా త‌న వంతు సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటాడు సంపూర్ణేష్ బాబు. అత్యంత త్వ‌ర‌లోనే ఝాన్సీతో పాట షూటింగ్ మొద‌లు పెట్టునున్నట్టు స‌మాచారం. సంపూర్ణేష్ బాబు అవ‌కాశాన్ని ఝాన్సీ స‌ద్వినియోగం చేసుకొని ఐట‌మ్ సాంగ్‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచితే త‌ప్పకుండా ముందు ముందు టాలీవుడ్‌లో బిజీ డ్యాన్స‌ర్ గా మారే అవ‌కాశముంది.

Also Read :  భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్లు తాగ‌వ‌చ్చా..? నీళ్ల‌ను ఎప్పుడు తాగాలంటే..?

Visitors Are Also Reading