Home » వివాహమైన నెల రోజులకే ఆమెకి నాలుగో నెల..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

వివాహమైన నెల రోజులకే ఆమెకి నాలుగో నెల..అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది అపురూపమైన ఘట్టం. రెండు కొత్త మనసులు, మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఏకమై కలకాలం పిల్లా పాపలతో కలిసి ఉండాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇందులో భర్త భార్యపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు, అలాగే భార్య కూడా భర్త పై చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటుంది. ఈ విధంగా ఒక్కటైన కొన్ని జంటలు మున్నాళ్ళకే ముక్కలు అవుతున్నాయి.. అయితే వీరు కూడా పెళ్లయిన నెల రోజులకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.. మరి ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..? ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది కొత్త ప్రయాణం లాంటిది.

Advertisement

పెళ్లి తో ఏకమైన ప్రతి జంట తమ కొత్త జీవితాన్ని హాయిగా కొనసాగించాలని భావిస్తారు. తాజాగా ఒక యువకుడు కూడా నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తమ జీవిత భాగస్వామితో సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ ఆ యువకునికి భార్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసింది. దీంతో తన భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్ లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మహారాజ్ గంజ్ లో ఓ జంట నెల రోజుల క్రితం పెద్దలు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా వుంటున్నారు. ఇటీవల నవవధువు కడుపు నొప్పిగా ఉందని భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆస్పత్రి తీసుకెళ్లాడు.

Advertisement

ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు నాలుగో నెల అని తెలియజేశారు. దీంతో తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా షాక్ అయిపోయారు. ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మమ్మల్ని మోసం చేశారంటూ భార్య మరియు ఆమె కుటుంబ సభ్యుల పై తీవ్రంగా కోపోద్రిక్తులైయ్యారు. వివాహమైన నెల అయితే నాలుగు నెలల గర్భం ఎలా వచ్చిందని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

also read;

రాజమౌళి కి చిరంజీవి కి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ? ఎవరికీ తెలియని నిజం…!

శ్రీదేవితో పెళ్లికి నో చెప్పిన తెలుగు హీరోలు..కానీ చివరికి ఇలా జరిగింది..?

 

Visitors Are Also Reading