Home » ఆషాడ మాసంలో స్త్రీలు ఈ గాజులు వేసుకుంటే భర్తకు చాలా మంచిదట..!!

ఆషాడ మాసంలో స్త్రీలు ఈ గాజులు వేసుకుంటే భర్తకు చాలా మంచిదట..!!

by Sravanthi
Ad

మహిళలు చేతి గాజులు వేసుకోవడం అనేది పూర్వ కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇప్పటికీ చాలామంది మహిళలు చేతి గాజులు వేసుకోకుండా ఉండలేరు. అందమైన అలంకరణ లో భాగం చేతినిండా గాజులు వేసుకోవడం. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో దుస్తులకు తగ్గట్టుగా గాజులు వేసుకుంటున్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్క దాని వెనుక శాస్త్రీయత ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వేసుకునే గాజులు అందానికే కాకుండా సౌభాగ్యానికి చిహ్నం. గాజుల్లో ఉండే రంగులను బట్టి రకరకాల అర్థాలు వస్తాయి.

Advertisement

 

అయితే ఏ రంగు గాజులు వేసుకుంటే ఎంత సౌభాగ్యం ఉంటుందో తెలుసుకుందాం. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని, ఉదా రంగు గాజులు స్వేచ్ఛని, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, అందిస్తాయి. అలాగే పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెల్ల రంగు గాజులు ప్రశాంతతని, నీలి రంగు గాజులు అధికారాన్ని ఈ విధంగా మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉన్నది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో పసుపు కుంకుమలతో పాటు గాజులు పెట్టి పూజించడం పూర్వకాలం నుంచి హిందువుల ఆచారంగా వస్తోంది.

Advertisement

ముత్తైదువులకు గాజులు ఇచ్చి గౌరవించే సంప్రదాయం హిందువులది. మణికట్టు భాగంలో గాజులు వేసుకోవడం వల్ల ఆ గాజుల యొక్క ఘర్షన రక్త ప్రసరణ వ్యవస్థను పెంచుతుంది. గాజులు ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళ కు పెడతారు. ఎందుకంటే గాజులు చేసే శబ్దాలు ఉద్దీపనలను అందిస్తాయట. వాటి శబ్దాలు కడుపులోని బిడ్డకు మంచి సంగీతం లాగా వినిపిస్తుందట. నిండు ముత్తైదువ చేతినిండా గాజులు వేసుకోవడం వల్ల తన భర్తకు అన్ని విధాల మంచి జరిగి అదృష్టం కలిసి వస్తుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading