Home » మహేష్ బాబు- నమ్రత పెళ్లి జరిగి అప్పుడే 18 ఏళ్లు అయిందా ?

మహేష్ బాబు- నమ్రత పెళ్లి జరిగి అప్పుడే 18 ఏళ్లు అయిందా ?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిపుల్ కపుల్స్ లో మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ జంట నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్ దేశంలో జరిగింది. ఆ సమయంలోనే మహేష్-నమ్రత మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది. 

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు లీకవుతుంటాయి. కానీ మహేష్ బాబు-నమ్రత రిలేషన్ షిప్ కి సంబంధించి ఎలాంటి విషయం బయటపడకపోవడం విశేషం. దాదాపు నాలుగు ఐదేళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట చివరికీ ఇంట్లో చెప్పేశారు. మహేష్ సోదరి మంజులనే వారి కుటుంబ సభ్యులను ఒప్పించిందట. ఇలా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఫిబ్రవరి 10, 2005న పెళ్లి జరిగింది. వీరి పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు గుడ్ భై చెప్పేసింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. సెలబ్రిటీల జీవితాలలో ఎన్నో చిక్కులు, చికాకులుంటాయని  పేర్కొంటున్నారు. అలాంటి వాటికి ఈ జోడి ఎంతో దూరమని నిరూపించింది. అంతేకాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ జంట ఒకరిపై ఒకరికీ ఉన్న ప్రేమని వ్యక్తపరుచుతుంటుంది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరూ పిల్లలున్న విషయం తెలిసిందే. వీలు కుదిరినప్పుడు అల్లా మహేష్ కుటుంబంతో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. 

ప్రేమ పెళ్లి గురించి మహేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వంశీ సినిమా చేస్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ ప్రయాణంలోనే ఆ స్నేహం ప్రేమగా మారింది. నాలుగేళ్లకి నా ప్రేమ విషయం చెప్పేశాను. తరువాత అంత చాలా స్మూత్ గా సాగిపోయింది. నాన్నకి నా మీద మొదటి నుంచి చాలా నమ్మకం ఉండేది. నేను మంచి నిర్ణయాలు తీసుకుంటాననే విసయం తెలుసు. అందుకే వెంటనే ఒప్పుకున్నారు అని మహేష్ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని మహేష్ అభిమాని ఒకరు ట్విట్టర్ ల షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాదితో వీరి బంధానికి 18 ఏళ్లు నిండాయి. తన భార్య నమ్రతాకి శుభాకాంక్సలు తెలుపుతూ మహేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. “ ఇద్దరి ప్రయాణంలో 10 ఏళ్లు గడిచిపోయాయి. జీవితాంతం ఇలాగే కొనసాగుదాం. హ్యాపీ యానివర్సరీ ఎన్ఎస్జీ” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read :  భార్య సంపాదన భర్త వాడుకుంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా ?

Visitors Are Also Reading