Home » కోహ్లీకి కరోనా పాజిటివ్ నిజమే.. కానీ…?

కోహ్లీకి కరోనా పాజిటివ్ నిజమే.. కానీ…?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకున్న టీం ఇండియా ఇప్పుడు గత ఏడాది కరోనా కారణంగా వాయిదాపడిన 5వ టెస్ట్ మ్యాచ్ తో పాటుగా మూడు టీ20 అలాగే మూడు వన్డేల సిరీస్ లో తలపడటానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ నుండి భారత జట్టు బయలుదేరడానికి ముందే పెద్ద షాక్ తగ్గిలింది. టెస్ట్ జట్టులో కీలక బౌలర్ అయిన అశ్విన్ కు కరోనా సోకడంతో అతను ఇంగ్లాండ్ వెళ్లే విమానం ఎక్కలేదు. కానీ మిగిలిన జట్టు మొత్తం క్షేమంగా అకాడమికి చేరుకుంది.
ఇక అక్కడికి వెళ్లిన మూడో రోజే ప్రాక్టీస్ ప్రారంభించింది ఇండియన్ టీం. కానీ అటువంటి సమయంలోనే ఈరోజు ఉదయం నుండి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కరోనా సోకింది అనే వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కోహ్లీ అక్కడికి వెళ్లిన తర్వాత బయట షాపింగ్ కోసం తిరుగుతూ ఫ్యాన్స్ తో ఫోటోలు దిగ్గాడు. దాంతో అక్కడే విరాట్ కు ఈ వైరస్ అంటుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు తగ సమాచారం ప్రకారం అవ్వని ఫెక్ వార్తలు అని తెలుస్తుంది. కానీ కోహ్లీకి మాత్రం కరోనా సోకింది అనేది నిజం అనేది తెలుస్తుంది.
అలా ఎలా అంటే… ఇంగ్లాండ్ కు వెళ్లే ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో.. విరాట్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ కు వెళ్ళాడు. కానీ అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ కు కరోనా పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇక్కడ ఇండియాలో ఉండగానే కోహ్లీ కరోనా నుండి కోలుకున్నాడు అని.. దాంతో ఇంగ్లాండ్ విమానం ఎక్కాడు అని తెలుస్తుంది. కానీ అందరూ కోహ్లీకి ఇంగ్లాండ్ కు వెళ్లిన తర్వాతే కరోనా సోకింది అని ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading