పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అప్పటికే విజయ్ దేవరకొండ ఒకటి రెండు సినిమాల్లో సైడ్ పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పెళ్లి చూపులు సినిమా తో ప్రేక్షకులను మెప్పించడం తో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ALSO READ : చిరంజీవి “భాషా” సినిమాను చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా…!
Advertisement
Vijay dewarakonda rashmika spotted at mumbai
ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం తో పాటు యువతలో విజయ్ దేవరకొండ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఈ చిత్రం తరవాత గీత గోవిందం తో విజయ్ దేవరకొండ మరో హిట్ కొట్టాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించింది. దాంతో టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.
Advertisement
Rashmika
ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే విజయ దేవరకొండ రష్మిక గీత గోవిందం సినిమా షూటింగ్ నుండి ప్రేమలో పడినట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అంతే కాకుండా వీరిద్దరూ మూబై లో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కారు. దాంతో ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.