తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్ లు వచ్చిన తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. దీంతో తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావనుకున్న సమయంలోనే విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. ఈ సినిమాలకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా చూస్తున్నంత సేపు సినిమా కొంచెం కూడా బోర్ లేకుండా చాలా ఆసక్తి కరంగా, ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అయినప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు చాలా బాగా ఫేమస్ అయ్యాయి.
అయితే మొత్తానికి ఈ సినిమాలో వెంకటేష్ ని పెద్దోడు అని, మహేష్ బాబుని చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు. ఇక చాలా మంది వాళ్ల పేర్లు ఏంటి ఎందుకు వాళ్లని అలా పిలుస్తున్నారు అంటూ చాలామందికి చాలా రకాల డౌట్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళిద్దరి పేర్లు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే సినిమాలో ఎక్కడ కూడా వాళ్ళ పేర్లను వాడుతూ వాళ్ళని పిలవడం జరగదు. ఎవరైనా పెద్దోడు, చిన్నోడు అనే పిలుస్తారు. అయితే ఈ సినిమాలో వాళ్ళకి ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు. అసలు వీళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
వాస్తవానికి ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు వెంకటేష్ పేరు మల్లి కార్జున్ రావు, మహేష్ బాబు పేరు సీతారామరాజు అని క్యారెక్టర్లకు పేర్లు ఫిక్స్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కానీ ఆయన అందరికీ నరేషన్ ఇస్తున్నప్పుడు పేర్లు చెప్పకుండా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు మాత్రమే ఎక్కువ వాడే వాడట. దీంతో ఒకరోజు ఆయన వాళ్ళ టీమ్ కి మరోసారి నరేషన్ ఇస్తున్నప్పుడు పెద్దోడు, చిన్నోడు అనే పేరును వాడుతూ కథ చెప్పాడట. హీరోల పేర్ల కంటే కూడా పెద్దోడు, చిన్నోడు అనే పేర్లు పిలవడానికి చాలా బాగున్నాయి అనుకొని ఆ క్యారెక్టర్లకి ఆ రెండు పేర్లను పిక్స్ చేశారట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Pushpa 2 : పుష్ప-2 సినిమాలో ఉర్ఫీ జావేద్ ?