Home » ప్రభాస్ వల్ల రాజమౌళికి తిట్లు.. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?

ప్రభాస్ వల్ల రాజమౌళికి తిట్లు.. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి తెలియని వారుండరు.  బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ స్టార్డమ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది.

Advertisement

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ  సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి.  

Also Read :  ఆయన మరణిస్తారని శ్రీహరికి 3నెలల ముందే తెలుసా.. కారణమేంటంటే..?

అంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా ప్రభాస్ కి ఓపెన్ గా మాట్లాడాలంటే కాస్త మొహమాటం. అందుకే ఫ్రీ రిలీజ్ వేడుకలకు హాజరైన ప్రభాస్ ఎక్కువ సేపు మాట్లాడలేరు. కేవలం ప్రీ రిలీజ్ వేడుకల ఫంక్షన్ లో మాత్రమే కాకుండా సినిమాల షూటింగ్ సెట్ లో ఎక్కువ మంది ఆర్టిస్టుల జనం ఉంటే గట్టిగా డైలాగ్ చెప్పడానికి  ఇబ్బంది పడుతారట ప్రభాస్. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా విషయంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  METER MOVIE REVIEW : మీట‌ర్ సినిమా రివ్వ్యూ…ఈ సారైనా కిర‌ణ్ అబ్బ‌వ‌రం హిట్ కొట్టాడా..?

Manam News

Advertisement

ఛత్రపతి సినిమాలో ఇంటర్వ్యూ సన్నివేశం చిత్రీకరణ సందర్బంగా విలన్ చంపిన తరువాత కోట శ్రీనివాసరావుకు ప్రభాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చిన తరువాత జనాలనుద్దేశించి డైలాగ్ చెప్పాలి. కానీ ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ జనం కనిపించే సరికి డైలాగ్ చెప్పలేకపోయారట. అప్పుడు అక్కడే ఉన్న రాజమౌళిని పిలిచి జక్కన్న నేను డైలాగ్ గట్టిగా చెప్పలేను. సైలెంట్ గా చెబుతాను. ప్లీజ్ అని ప్రభాస్ అన్నారట. అందుకు రాజమౌళి కూడా ఒప్పుకోవడంతో హై పిచ్ లో డైలాగ్ చెప్పాల్సిన ప్రభాస్ చిన్నగా చెబుతూ షాట్ పూర్తి చేశాడట. అప్పుడు రాజమౌళి అకస్మాత్తుగా షాట్ ఓకే అనగానే అప్పటి వరకు రిహార్సల్స్ అనుకున్న వారందరూ ఆశ్చర్యపోయారట.

Manam News

కేవలం ఛత్రపతి సినిమా విషయంలో మాత్రమే కాకుండా.. మిస్టర్ ఫర్పెక్ట్ షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడ్డారట. అప్పుడు దర్శకుడు కే విశ్వనాథ్ పిలిచి ఇలా అయితే ఎలాగైతే ఓపెన్ డైలాగ్ చెప్పాలి. సిగ్గు పడితే ఎలా అని అన్నారట. అప్పుడు విశ్వనాథ్ ముందు సరే అన్న ప్రభాస్ మళ్లీ యదావిధిగా డైలాగ్ చెప్పడానికి సిగ్గుపడ్డారట. ఇక అప్పటి నుంచి ప్రభాస్ తో పని చేసే దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకోవడం ప్రారంభించారట. ప్రభాస్ కి డైలాగ్ సన్నగా చెప్పే అలవాటును రాజమౌళినే ప్రభాస్ కి నేర్పించారని తిట్టుకునే వారు. రాజమౌళి అలవాటు చేయడం వల్ల నువ్వు డైలాగ్ లు నెమ్మదిగా చెబుతున్నావని ప్రభాస్ తో అనేవారట. ఇక  ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్రభాస్.  

Also Read :  చిరు, వెంకీ, నాగ్ కాంబోలో రావలసిన ఆ 100వ చిత్రం ఎందుకు ఆగిందో తెలుసా..?

Visitors Are Also Reading