సాధారణంగా మనం ఏ కూర చేసినా అందులో టమాటా తప్పకుండా వాడుతుంటాం. కానీ వాస్తవానికి టమాటా అనేది అసలు కూరగాయ జాతికి చెందినదే కాదట. అది పండ్ల జాతికి చెందినది అనే విషయం చాలా మందికి తెలియదు. పండ్లను మనం వండకుండా తింటాము. కానీ టమాటా పండ్లను మాత్రం వండుకొని తింటాం. ఇలా ఎందుకనే అంశానికి బలమైన కారణమే ఉందండి. ఇది పుల్లగా ఉండే టమాటాలు కూరకు మంచి రుచి ఇవ్వడమే కాదు.. రంగుని కూడా ఇస్తాయి. క్యాన్సర్ సహా పలు రకాల వ్యాధులను అడ్డుకొని ఆరోగ్యాన్ని కాపాడుతాయి. టమాటాలను మనం నిత్యం కూరల్లో వాడుతుంటాం. కానీ టమాటా గింజలు మనకు హాని చేస్తాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
Advertisement
టమాటా గింజలలో లైకోపిన్ అనే యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. అంతేకాదు.. గుండె, కిడ్నీల పని తీరును మెరుగుపరుచుతుంది. అదేవిధంగా మన శరీరం కాల్షియంని గ్రహించే విధంగా చేస్తుంది. టమాటా గింజలు మన చర్మానికి చాలా మేలు చేస్తాయి. టమాటా గింజలు చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిలో సి విటమిన్, న్యూట్రిషనల్ ఫైబర్ వంటివి ఉంటాయి. జీర్ణక్రియ సక్రమంగా జరిగేవిధంగా చేస్తుంది. పొట్టకు చాలా మేలు చేస్తాయి. బాడీలో పలు పార్ట్ లు బాగా పని చేసేందుకు సహకరిస్తాయి. అంతేకాదు.. శరీరానికి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ ని ఇవి ఉత్పత్తి చేస్తాయి. టమాటా గింజల్లో విషం ఉంటుందని.. తినకూడదని అసత్య ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ గింజలలో విషం అన్నదే ఉండదు. టమాటాలలో విషం ఉండదు. ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే.. దానికి ఓ కారణం ఉంది.
Advertisement
Also Read : వెల్లుల్లికి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. ఒకవేళ తింటే అంతే సంగతులు..!
టమాటా మొక్కలలో సొలానైన్ అనే విషపూరిత ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మొక్క యొక్క కాండం, ఆకులలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మొక్క పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ విషం కారణంగానే టమాటా మొక్కల జోలికి అసలు జంతువులు రావట. అలా ప్రకృతి ఈ మొక్కలకు రక్షణ కల్పిస్తోంది. టమాటాలు, గింజలు అన్ని మంచివే.. కానీ అతిగా అస్సలు వాడకూడదు. ప్రధానంగా గ్యాస్ సమస్య ఉన్నవారు.. టమాటా గింజలకు కొంచెం దూరంగా ఉండాలి. టమాటా గింజల వల్ల వారికి గుండె మంట వస్తుంది. జీర్ణక్రియపై ఈ గింజలు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. అందుకే వారు జాగ్రత్తగా ఉండడం బెటర్.