Home » హాయ్ నాన్న మూవీకి హీరోయిన్ మృణాల్ మైనస్ అయిందా ?

హాయ్ నాన్న మూవీకి హీరోయిన్ మృణాల్ మైనస్ అయిందా ?

by Anji
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ మొత్తం ‘యానిమల్’ మేనియాలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలై ఇప్పటికే వారం గడుస్తోంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదు. మరి ఇలాంటి టైంలో వేరే హీరో సినిమా రిలీజ్ చేయాలనుకుంటే అది సాహసం అవుతుంది. నాని అలాంటి సాహసమే చేశాడు. ‘హాయ్ నాన్న’ అంటూ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసాడు. మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు ‘హాయ్ నాన్న’కు మృణాలే మైనస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.

Hi-nanna-Review

Advertisement

“సీతారామం” సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు ఫస్ట్ మూవీతోనే సౌత్ ప్రేక్షకులందరినీ మాయ చేసేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది మృణాల్. ఈ భామకు “సీతారామం” సినిమాతో వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో మంచి అవకాశాలు తలుపు తట్టాయి. అందులో ‘హాయ్ నాన్న’ మూవీ ఒకటి. టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న మృణాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా సరిగ్గా సరిపోతుందని మేకర్స్ అంచనా వేశారు. అలాగే స్క్రీన్ పై నాని, మృణాల్ జోడి రొమాన్స్ అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ‘సమయమా’ సాంగ్ అలా అనుకోవడానికి ప్రధాన కారణం. ఇలా సినిమాకు మెయిన్ ఎస్సెట్ గా మారుతుందని భావించిన మృణాలే మైనస్ గా మారిందట.

Advertisement

అసలు విషయంలోకి వస్తే… “హాయ్ నాన్న” సినిమాలో మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగానే ఉన్నా, లుక్స్ పరంగా మైనస్ అయిందని అంటున్నారు విమర్శకులు. ప్రస్తుతం “హాయ్ నాన్న” మూవీపై విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తుండగా, ఆ టాక్ తో పాటు సినిమాకు హీరోయినే మైనస్ అయింది అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి తీర్పుని ఇస్తారు అనేది వేచి చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అందుకోవడానికి దూసుకెళ్తున్న మృణాల్ కు ఈ మూవీ హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ‘హాయ్ నాన్న’ మూవీ కనక డిజాస్టర్ అయ్యిందంటే అది తప్పకుండా మృణాల్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా షూటింగ్ టైంలో ఆమె వ్యవహరించే తీరుతో నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా ఎఫెక్ట్ మృణాల్ పై ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading