తెలుగు సినిమా హీరోలు ఒక కీలక దశకు చేరుకున్నతరువాత రాజకీయాల వైపు చూడడం కొత్తేమి కాదు. తమిళ స్టార్ హీరో ఎంజీఆర్, తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ రాజకీయంగా అత్యంత ఉన్నత స్థానాలను చూసారు. ఇక వీరి స్ఫూర్తితో చాలా మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరు. మిగతా నటులకు భిన్నంగా కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది.
Advertisement
నటుడిగా ఆయన పీక్స్ లో ఉన్నప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో కానీ ఆయన ఎంపీగా, కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ తరుపున వ్యవహరించారు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. 2004లో టీడీపీ-బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ హవాలో చిత్తు చిత్తు అయ్యాయి. ఆ సమయంలో కృష్ణంరాజుకి కూడా ఓటమి తప్పలేదు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత కృష్ణంరాజు రాజకీయ కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఒక దశలో కాంగ్రెస్ పట్ల సానుకూలంగా స్పందించే వరకు వచ్చారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు కృష్ణంరాజు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : కేజీఎఫ్ లాంటి సినిమాలో చిరంజీవి 36 ఏళ్ల క్రితమే నటించాడు…ఆ సినిమా ఏదంటే..?
2014లో బీజేపీ కేంద్రంలోక అధికారంలోకి వచ్చిన తరువాత పాత పరిచయాలతోనో ఏమో కానీ బీజేపీలో చేరారు. ఆ దశలో ఆయనకు బీజేపీ తరుపున గవర్నర్ పదవీ హామీగా వచ్చిందనే ప్రచారం కొనసాగింది.త్వరలోనే కృష్ణంరాజు గవర్నర్ గా నియమితం కానున్నారు అని.. రోశయ్య స్థానంలో తమిళనాడుకి చార్జ్ తీసుకుంటారనే టాక్ కూడా వినిపించింది. కానీ అలాంటిది ఏమి జరుగలేదు. బాహుబలి సూపర్ హిట్ తరువాత ప్రభాస్ ఇమేజ్ తో పాటు కృష్ణంరాజు పేరు మళ్లీ మారుమ్రోగిపోయింది. రాజకీయంగా అవకాశం మాత్రం లభించలేదు. బీజేపీ తరుపున పని చేసిన వారికి నరేంద్ర మోడీ మంచి అవకాశాలు కల్పించారు. కానీ ఎందుకో కృష్ణంరాజుకు మాత్రం గవర్నర్ అవకాశం కల్పించలేదు.
ఇది కూడా చదవండి : రమ్యకృష్ణ ఓ నటుడికి చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది.. ఆ నటుడు ఎవరో తెలుసా..?