Home » ఎన్టీఆర్ టెంపర్ మూవీలో ఆర్.నారాయణ మూర్తి కి ఆఫర్ వస్తే.. ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

ఎన్టీఆర్ టెంపర్ మూవీలో ఆర్.నారాయణ మూర్తి కి ఆఫర్ వస్తే.. ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

 ఎన్టీఆర్-పూరిజగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ఆంధ్రావాలా మూవీ ఫ్లాప్ అయింది. అయితే  అలాంటిటి ఫ్లాప్ కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్టైన సినిమా ‘టెంపర్’. ఈ సినిమాలో తారక్.. అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. నీతి, నిజాయితీ అనే స్పెల్లింగ్ తెలియని హీరో ఎలా నిజాయితీ పరుడైన ఆఫీసర్‌గా మారాడు. అందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. ఈ సినిమాలో హీరోను మార్చడంలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ మూర్తి పాత్ర ఎంతో కీలకం. ఆ క్యారెక్టర్‌ను పోసాని కృష్ణమురళి ఎంతో హుందాగా నటించి మెప్పించారు.

posani-krishna-murali

Advertisement

 

తొలుత ఆ పాత్ర కోసం పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ అనుకున్న పేరు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. అయితే పూరీ, ఎన్టీఆర్‌ల టెంపర్‌ మూవీలో ఆ పాత్ర చేయకపోవడానికి గల కారణాలను ఆర్. నారాయణ మూర్తి పలు సందర్బాల్లో ప్రస్తావించారు. ఇక ‘టెంపర్‌’ మూవీలో అలాంటి గొప్ప వేశాన్నినాకు ఇచ్చేందకు ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్‌కు హాట్సాఫ్ చెబుతున్నాను. ఒక వెరైటీ డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాలని పూరీ జగన్నాథ్ అనుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరి అడిగారు. కానీ వాళ్ల ఆఫర్‌ను నేను సున్నితంగా తిరస్కరించాను. నన్ను మన్నించమని కోరాను.

Advertisement

నేను జూనియర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్టేజ్‌కు వచ్చాను. ఇక హీరోగా ఓ ఐదారేళ్లు మించి చేయలేను. ఈ లోపు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషం వేయకూడదని అనుకున్నాను. హీరోగా రిటైర్మెంట్ ప్రకటించాలనేదే తన ఉద్దేశ్యం అన్నారు. అంతే తప్ప మరో ఉద్దేశ్యం లేదున్నారు పీపుల్స్ స్టార్.ఆర్. నారాయణ మూర్తి అనుకున్న పాత్రను దర్శకుడు పూరీ జగన్నాథ్.. పోసాని కృష్ణమురళిలో చేయించాడు. అందులో పాత్ర పేరు కూడా నారాయణ మూర్తి పేరు పెట్టడం విశేషం. అవినీతి అధికారి అయిన ఎన్టీఆర్‌కు ఎపుడు సెల్యూట్ చేయడు. కానీ మంచివాడిగా మారిన తర్వాత సెల్యూట్ చేస్తూ పోసాని చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమా విజయంలో ఈ పాత్ర కీ రోల్ పోషించింది.

Also Read : త్రిష పై అసభ్యకర కామెంట్స్ చేసిన పొలిటీషియన్.. స్ట్రాంగ్ కౌంటర్..!

Visitors Are Also Reading