సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక జంట విడిపోతూనే ఉంటుంది. అంతే కాకుండా బయట ఎంతో అందంగా కనింపించే జంటలు కూడా విడిపోవడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. సమంత నాగచైతన్య చాలా ఏళ్ల పాటూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ జంట విడాకులను ప్రకటించింది. అంతే కాకుండా తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు.
వాళ్ల విడాకుల వార్త కూడా సౌత్ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో సెలబ్రెటి జంట కూడా సమంత నాగచైతన్య రూట్ లోనే వెళుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జంట మరెవరోకాదు బుల్లి తెరపై సందడి చేస్తున్న శ్రావణ భార్గవి హేమచంద్రలు….వీరిద్దరూ సింగర్ లు కాగా ప్రేమ వివాహం చేసుకున్నారు.
Advertisement
Advertisement
రైడ్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట 2013 లో వివాహం చేసుకుని ఒక్కట్టయింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. పెళ్లి తరవాత వీరిద్దరూ కలిసి సింగర్ లు గా కొనసాగుతూనే మరోవైపు బుల్లితెరపై పలు టీవీ షోలకు యాంకర్స్ గా పనిచేశారు. ఈ జంటకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. స్క్రీన్ పై వీరిద్దరూ చూడచక్కగా కనిపించడం ఒకరిపై మరొకరు చూపించే ప్రేమ వల్ల యాత్ చాలా మంది వీరిని అభిమానిస్తున్నారు.
అయితే ఇప్పుడు వీరిద్దరూ కొంతకాలం గా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వీరు విడాకులకు కూడా సిద్దం అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఓ వైపు విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నా ఇప్పటి వరకూ ఇద్దరూ స్పందించలేదు. ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.
ALSO READ :షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకోసమంటే..?