సమంత అక్కినేని తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకుని సమంత రుతుప్రభు గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి విడాకులకు స్పష్టమైన కారణం ఏంటో అభిమానులకు ఇప్పటికీ తెలియదు కానీ చక్కటిజంట విడాకులు తీసుకున్నారన్న బాధమాత్రం ఉండిపోయింది. అయితే కొంతమంది మాత్రం సమంత ఫ్యామిలీ మ్యాన్ లో బోల్డ్ పాత్రలో నటించడే విడాకులకు దారితీసిందని అంటున్నారు. సమంత షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఫ్యామిలీ లైఫ్ ను పట్టించుకోవడం లేదని పిల్లలను కనేందుకు కూడా ఇష్టపడటం లేదని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా నాగచైతన్య మరో హీరోయిన్ తిరగటం వల్లే సమంత విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వినింపించాయి. మరోవైపు త్వరలోనే నాగచైతన్య వివాహం కూడా చేసుకోబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా నాగచైతన్య విడాకుల తరవాత వరుస హిట్లతో స్వింగ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. విడాకుల తరవాత వచ్చిన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Advertisement
Advertisement
ఆ తరవాత నాగార్జున నాగచైతన్య కలిసి నంటించిన బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం సాధించింది. అదే విధంగా నాగచైతన్య బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. అయితే సమంత కెరీర్ మాత్రం విడాకుల తరవాత కాస్త డల్ గానే కనిపిస్తోంది.
విడాకుల తరవాత సమంత ఐటమ్ సాంగ్ చేసిన పుష్ప రిలీజ్ అయ్యింది. కానీ సినిమాలో హీరోయిన్ గా ఉండాల్సిన సమంత ఐటమ్ సాంగ్ చేయాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ హీరో విజయ్ సేతుపతితో చేసిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. తెలుగులో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా తరవాత విజయ్ దేవరకొండతో చేసే ప్రాజెక్ట్ తప్ప మరే సినిమాలు సమంత చేతిలో లేనట్టు తెలుస్తోంది. ఒకప్పుడు సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో సమంతను అక్కినేని శాపం వెంటాడుతోందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read:
నేనే మీ వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటా…విజయ్ దేవరకొండ పై సమంత కామెంట్స్ వైరల్…!
సోషల్ మీడియాలో సమంత పోస్టర్ వైరల్..!