Home » ప్రవీణ్ సత్తారు మూవీతో వరుణ్ కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా ?

ప్రవీణ్ సత్తారు మూవీతో వరుణ్ కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా ?

by Anji
Ad

వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ గాండీవదారి అర్జున. ఈ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఘని లాంటి ఘోర డిజాస్టర్ అందుకున్న తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ కెరీర్ లో ఎఫ్2, ఎఫ్3 లాంటి రొటీన్ కమర్షియల్  హిట్స్ తప్ప చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్స్ మాత్రం అంతగా లేవు. డిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ లేని వరుణ్ తేజ్ ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ సినిమా మీద ఆసక్తి మాత్రం పెంచలేకపోయింది.

Advertisement

సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ఆ రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ కాలేదనే చెప్పాలి. ప్రమోషన్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ హీరోకి గతంలో ఘని వంటి డిజాస్టర్ ఉండటం.. సరైన హిట్ లేని ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ కావడం వల్ల సినిమా మీద నామమాత్రపు అంచనాలు కూడా ఏర్పడలేదు. పైగా ఇటీవల మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన బ్రో, భోళాశంకర్ సినిమాలు కూడా అంచనాలు తలకిందులు చేసిన నేపథ్యంలో మెగా అభిమానుల్లో నెలకొన్న నిరాశ కూడా ఇందుకు కారణం అని చెప్పాలి.

Advertisement

వరుణ్ తేజ్ రా ఏజెంట్ గా కనిపించిన ఏ సినిమాకు ఫస్ట్ షోకి డీసెంట్ టాక్ సొంతం చేసుకోవటం కీలకమని చెప్పాలి. ఆగస్టు 25న పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడంతో  ఈ సినిమాకి కాస్త కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఫస్ట్ షోతో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా మౌత్ టాక్ తో ఫాస్ట్ వీకెండ్ ముగిసే సరికి డీసెంట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి, బడ్జెట్ కి తగిన బజ్ క్రియేట్ కాని ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

రానా పై దుల్కర్ సల్మాన్ అలాంటి కామెంట్స్ చేశాడా ? సోషల్ మీడియాలో వైరల్..!

ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి అయిన వెంటనే అది జరగడం పక్కా..!

 

Visitors Are Also Reading