Home » డెలివరీకి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిదేనా..?

డెలివరీకి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిదేనా..?

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతిదీ వారు అనుకున్నట్టుగానే చేసుకుంటున్నారు. ప్రెగ్నెంట్ అయ్యాక డెలివరీ ఎప్పుడు అవుతుందనేది కూడా డాక్టర్లు చెబుతుండడంతో చాలామంది డెలివరీ కి కూడా ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు.. మరి డెలివరీకి ముహూర్తాలు పెట్టించుకోవడం మంచిదేనా.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ముహూర్తం చూసుకోవడం మంచిదే కానీ ఆ ముహూర్తంలో పుట్టిన శిశువు సద్గుణాలు కలిగి ఉంటాడు అనుకోవడం మన పొరపాటే.

Advertisement

also read:అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాలో నటించిన NTR, బాలయ్య..కానీ విడుదలవ్వలేదు..కారణం..!!

కొంతమంది రాముల వారి జన్మ నక్షత్రంలో పుడితే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా పుట్టబోయే బిడ్డ కూడా మంచి సద్గుణాలు కలిగి ఉంటాడు అని భావిస్తూ ఉంటారు. అలా వీరు ముహూర్తం పెట్టుకొని డెలివరీలు చేయించుకోవడం వల్ల అనేక వైద్య సమస్యలు ఎదురవుతున్నాయట. దీనివల్ల శిశువు ఆరోగ్యం పై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.. ఇంతకీ ఆ సమస్యలు ఏంటయ్యా అంటే.. మీరు మంచి రోజు అని నిర్ణయించుకొని ఆస్పత్రిలో చేరడం వల్ల ఒకే రోజు చాలామంది ఆసుపత్రికి డెలివరీకి రావడం వల్ల వైద్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. దీంతో ప్రసూతి వైద్యులు ఒత్తిడికి లోనవ్వడం, ఇది ప్రైవేట్ ఆస్పత్రులకు కాసుల పంటగా మారుతోందని చెప్పవచ్చు.

Advertisement

ఈ మధ్యకాలంలో ముహూర్తాలు పెట్టుకుని డెలివరీ చేయడంతో పాటు, నొప్పులు లేకుండా డెలివరీ చేయబడును అంటూ స్పెషల్ ఆఫర్లు, ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు కొంతమంది ఆసుపత్రి యాజమాన్యాలు. కానీ పూర్వకాలంలో ఇవేవీ తెలియనప్పుడు ఎలాంటి ముహూర్తం లేకుండానే సాధారణ కాన్పుల వల్ల జన్మించిన వారంతా చాలా ఆరోగ్యంగా చక్కని జీవనాన్ని గడుపుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా పుట్టిన వారిలో చాలామంది అదృష్టం కలిగిన వారు ఉన్నారు. కాబట్టి ముహూర్తాలు చూసి డెలివరీ చేయించుకోకుండా ఆరోగ్య పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading