సాధారణంగా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ఎక్కువగా సలాడ్ తింటుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఉదయం వేళలో అల్పాహారంగా సలాడ్ తింటారు. శరీరాన్ని హైడ్రెడ్ చేయడానికి రక్తనష్టాన్ని తగ్గించడానికి, శక్తిని పెంచడానికి ఆరోగ్య నిపుణులు సలాడ్ తినాలని సిఫారసు చేస్తుంటారు. ఎక్కువగా సలాడ్లను కూరగాయల నుంచే తయారు చేస్తారు. వీటిలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Advertisement
వీటిలో ఎక్కువగా దోసకాయ, టమోటాను ఉపయోగిస్తుంటారు. దోసకాయ కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. దోసకాయలో 95 శాతం నీరుంటుంది. శరీరం నుంచి విషాన్ని బయటికి పంపించడంలో సహాయపడుతుంది. దోసకాయలో ఇథనాల్ ఉంటుంది. రక్తంలో ఇది గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. బొడ్డు కొవ్వు చక్కర, కొలెస్ట్రాల్ కి సంబంధించింది. దోసకాయ రెండింటిని తగ్గించడంతో పాటు పొట్టలోని కొవ్వును కూడా తగ్గిస్తుంది. దోసకాయలు,టమోటాలు తరుచూ సలాడ్లలో వడ్డిస్తారు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పొట్టకు చాలా ప్రమాదం అని నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
నిపుణుల ప్రకారం.. ప్రధానంగా దోసకాయ టమోటాలు కలిపి తింటే జీర్ణక్రియకు హాని కలుగుతుంది. ఆమ్ల ph కూడా ‘సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి,వికారం, అలసట, అజీర్ణం తదితర సమస్యలు తలెత్తుతాయి. దోసకాయలు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడే ఖనిజాలను కలిగిఉంటాయి. విటమిన్ సిని గ్రహించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా కీరదోసకాయలు, టమోటాలను కూడా కలిపి తినకపోవడం చాలా ఉత్తమం. దోసకాయ, టమోటా రెండు కలిపి తింటే శరీరంలో కిణ్వప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తింటే పొట్టకే కాదు.. శరీరానికి మొత్తం హానికరం. పొట్టలో రకరకాల సమస్యలు తలత్తుతాయి. అదేవిధంగా దోసకాయ పాలు కలిపి కూడా తినకూడదు. శరీరాన్ని మరింత దిగజార్చే అవకాశముంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పరాయి స్త్రీలతో భర్తలు సంబంధం పెట్టుకోవడానికి ఈ మూడు విషయాలే కారణమట.. అవేంటంటే?
కూల్ డ్రింక్ బాటిల్ లో నిండుగా నింపితే అంత ప్రమాదమా..?