Home » సలార్’ మూవీ లో ప్రభాస్ స్నేహితుడి పాత్రని మిస్ చేసుకున్న క్రేజీ టాలీవుడ్ హీరో అతడేనా ?

సలార్’ మూవీ లో ప్రభాస్ స్నేహితుడి పాత్రని మిస్ చేసుకున్న క్రేజీ టాలీవుడ్ హీరో అతడేనా ?

by Anji
Ad

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన తాజా చిత్రం సలార్ . మరికొద్ది గంటల్లోనే   ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.  కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలనాత్మక సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే.. ఇక  ఏ రేంజ్ లో ఉండాలో, అంతకు మించే ఈ చిత్రం ఉందని రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ ని చూస్తే ఈ విషయం స్పష్టంగా  అర్థం అయింది. రెండు రోజుల కిందటే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్  బుకింగ్స్  ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు. ఊహించిన విధంగానే బుక్ మై షో యాప్ కూడా క్రాష్ అయ్యే విధమైన రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

గంటకి 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్న ఈ సినిమాకి గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ, ఇతర భాషల్లో అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ వచ్చేలా లేదు.ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం లో ప్రభాస్ తో సమానమైన క్యారక్టర్ ని ఆయన పోషించాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ నా కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని పృథ్వీ రాజ్ ఈ సందర్భంగా చెప్పాడు.నిజంగా రెండు ట్రైలర్స్ మరియు సూరీడు పాట ని చూసిన తర్వాత పృథ్వి రాజ్ కి అద్భుతమైన క్యారక్టర్ పడినట్టు అనిపించింది.

Advertisement

 

ఈ పాత్ర ఎవరో మలయాళం హీరో చేసే బదులు మన తెలుగు లోనే ఎవరైనా మీడియం రేంజ్ హీరో తో చేయిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయం ఉండేది. మనకి వచ్చిన ఈ ఆలోచన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రాకుండా ఎందుకు ఉండి ఉంటుంది.  కచ్చితంగా వచ్చింది.ఈ పాత్రని తొలుత ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్ తో చేయించాలని అనుకున్నాడట. కానీ గోపీచంద్ ప్రభాస్ కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. గతం లో ‘వర్షం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.  ఇందులో ప్రభాస్ హీరో గా నటించగా, గోపీచంద్  విలన్ గా నటించాడు. అప్పుడు ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  ఇదిలా ఉంటే..   ప్రశాంత్ నీల్ అడగగానే గోపీచంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభాస్ ఒప్పుకోలేదట. ఎందుకంటే హీరో గా కొనసాగుతున్నావు. ఇలాంటి సమయంలో ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ లో అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి.  వద్దు అని చెప్పడంతో గోపిచంద్ వచ్చిన ఆ పాత్ర ను   పృథ్వీ రాజ్ చేయాల్సి వచ్చిందట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading