ప్రస్తుతం టీం ఇండియా హెడ్ కోచ్ గా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్. భారత గొప్ప బ్యాటర్లలో ఒక్కడైనా ద్రావిడ్ మొదట అండర్ 19 జట్టుకు కోచ్ గా వ్యవరించాడు. అప్పుడు ఎన్నిసార్లు సీనియర్ జట్టుకు కెప్టెన్ గా రావాలి అని అడిగిన అది కుదరలేదు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా మారిన ద్రావిడ్ గంగూలీ బవంతా పెట్టడంతో టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. దాంతో టీం ఇండియా ఎంతో సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ద్రావిడ్ వల్లే భారత జట్టు ఓడిపోతుంది అనే వాదన వస్తుంది.
Advertisement
అయితే ద్రావిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత టీం ఇండియా ఆడిన మ్యాచ్ లలో చాలా వరకు ఓడిపోయింది. ప్రస్తుతం మన సొంత గడ్డపైనే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా టీం ఇండియా వరుస మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇక ఈ ఓటమికి ద్రావిడ్ తీసుకున్న నిర్ణయాలే కారణం అని అంటున్నారు అభిమానులు. మొదట ఈ సిరీస్ కు పంత్ కెప్టెన్సీ ఇవ్వడానికి ద్రావిడ్ అంగీకరించడమే పెద్ద తప్పు అని చెబుతున్నారు. పంత్ కు కెప్టెన్సీ సరిగ్గా రాకున్న అతనికి ఎందుకు ఆ భాధ్యతలు ఇచ్చావ్ అని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ఇక నిన్నటి మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోతున్న తరుణంలో ఐపీఎల్ లో బాగా రాణించిన దినేష్ కార్తీక్ ను కాదని ఆరో స్థానంలో బ్యాటింగ్ కు అక్షర్ పటేల్ ను పంపించాడు. కానీ వచ్చిన అక్షర్ మాత్రం పరుగులు చేయకేపోయాడు. ఆ తర్వాత ఎదో స్థానంలో వచ్చిన కార్తీక్ 30 పరుగులతో రాణించాడు. అదే ముందే కార్తీక్ వచ్చిఉంటే అతను ఇంకా ఎక్కువ పరుగులు చేసి ఉండేవాడని అప్పుడు భారత్ కు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండేవి అని అంటున్నారు అభిమానులు. ఇలా సరైన జట్టును ఎంపిక చేయకుండా ద్రావిడ్ చేస్తున్న తప్పుల కారణంగానే భారత జట్టు పరాజయాల పాలవుతుంది అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :