Home » చిరంజీవి చేసిన ఆ పని వల్లే బన్నీ స్టార్ హీరోగా మారారా..?

చిరంజీవి చేసిన ఆ పని వల్లే బన్నీ స్టార్ హీరోగా మారారా..?

by Sravya
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకచ్చి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప 1 ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యింది అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు పుష్ప టు కూడా అదే రేంజ్ లో సక్సెస్ ని అందుకుంటుందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ అయితే అంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరమీదకి వస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్ కిట్టయ్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలని చెప్పారు. చిన్నప్పుడు ఏవైనా చిన్న తప్పులు చేస్తే సుకుమార్ ని బుక్ చేసేవాడినని ఆయన అన్నారు. నేను ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్నాను అని ఆయన చెప్పారు. సుకుమార్ సినిమాల్లో నేను ఎక్కడో ఒకచోట కనిపిస్తాను కాని పాత్రలు ఎక్కడా రిజిస్టర్ కాలేదని కిట్టయ్య అన్నారు.

allu-arjun-in-ads

Advertisement

Advertisement

100% లవ్ లో కిట్టయ్యి పాత్రలో నేను కనిపించానని చెప్పారు. సుకుమార్ స్కూల్ టైం లోనే కవితలు బాగా రాసేవారని చెప్పారు ఎడిటర్ మోహన్ గారి దగ్గర సుకుమార్ పని చేసే వారిని అప్పట్లో సుకుమార్ కి కోపం ఎక్కువగా ఉండేదని చెప్పారు కిట్టయ్య. వినాయక్ దగ్గర సుకుమార్ దిల్ సినిమాకి పనిచేశారని కిట్టయ్య చెప్పారు. ఆర్య సినిమా కథ సుకుమార్ చెప్తే ఎవరికి నచ్చలేదని చెప్పారు. బన్నీలో ఉన్న స్పార్క్ నాకు కనపడిందని చెప్పి సుకుమార్ బన్నీని సెలెక్ట్ చేసుకున్నారు.

చిరంజీవి గారు ఆర్య సినిమా కథ విని ఓకే చెప్పారని అల్లు అరవింద్ కూడా ఆ సినిమా విషయంలో భయపడ్డారని మెగాస్టార్ నచ్చచెప్పి ఓకే చేయించారని కిట్టయ్య అన్నారు. ఇలా బన్నీ స్టార్ హీరో అవ్వడానికి చిరంజీవి పరోక్షంగా కారణమని నెటిజెన్స్ కిట్టయ్య మాటలు విని సంతోష పడుతున్నారు. బన్నీ సుకుమార్ కాంబోలో ఇప్పుడు పుష్ప సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా వాటిని రీచ్ అవుతారు సుకుమార్ అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి పుష్ప సినిమా ఎంతవరకు బన్నీకి సక్సెస్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading